Friday, April 4, 2025
HomeతెలంగాణRasamai Balakishan: రసమయికి శుభాకాంక్షల వెల్లువ

Rasamai Balakishan: రసమయికి శుభాకాంక్షల వెల్లువ

సందడిగా మారిన క్యాంపు కార్యాలయం

కరీంనగర్ జిల్లా మానకొండూర్ బీ.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డా.రసమయి బాలకిషన్ ను ప్రకటించడంతో రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్, మానకొండూర్ ఎమ్మెల్యే డా.రసమయి బాలకిషన్
కు అభినందనలు వెళ్ళువెత్తుతుండంతో క్యాంపు కార్యాలయం పూర్తిగా సందడిగా మారింది.
మానకొండూర్ నియోజకవర్గంలోని పలు మండలాల నుండి ప్రజాప్రతినిధులు, బీ.ఆర్.ఎస్ పార్టీ శ్రేణులు, యువజన, విద్యార్థి విభాగం నాయకులు, భారీ సంఖ్యలో తరలివచ్చి ఘనంగా సన్మానించి శుభా కాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, జడ్పిటిసి తాళ్ల పల్లి శేఖర్ గౌడ్, సింగిల్ విండో చైర్మన్ సింగిరెడ్డి స్వామిరెడ్డి, నాయకులు సల్ల రవీందర్, జాప శ్రీనివాస్ రెడ్డి తో పాటు ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

-రసమయి సమక్షంలో పార్టీలోకి యువ సైన్యం…

మానకొండూర్ నియోజకవర్గంలోని యువ సైన్యం గులాబీ గూటికి భారీగా చేరింది. శంకరపట్నం మండలం తాడికల్, ధర్మారం, చింతగుట్ట గట్టు గ్రామాల్లోని వివిధ పార్టీలకు చెందిన యువకులు రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్, మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్ సమక్షంలో బీ.ఆర్.ఎస్. పార్టీలో చేరగా, కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటీసి లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి, బీ.ఆర్.ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంట మహిపాల్, సర్పంచులు, ఎంపీ టీసీలు, నాయకులు, కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News