Friday, September 20, 2024
HomeతెలంగాణRasamai: నర్సింగాపూర్ లో అభివృద్ధి పనులు

Rasamai: నర్సింగాపూర్ లో అభివృద్ధి పనులు

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నర్సింగాపూర్ గ్రామంలో సుమారు రూ.50 లక్షల నిధులతో నూతన గ్రామపంచాయితీ కార్యాలయం భవనం, సీసీ రోడ్లు, మున్నూరు కాపు సంఘం కమ్యూనిటీ హాల్ వంటి పలు అభివృద్ధి పనుల నిర్మాణానికి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన రాష్ట్ర సాంస్కృ తిక సారథి ఛైర్మెన్, మానకొండూర్ శాసనసభ్యులు డా. రసమయి బాలకిషన్. అనంతరం గ్రామంలో బీ.ఆర్.ఎస్. పార్టీ జెండాను ఆవిష్కరించి, లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రసమయిని ఘనంగా సన్మానించిన స్థానిక సర్పంచ్, ప్రజాప్రతినిధులు.
ఈ కార్యక్రమంలో నర్సింగాపూర్ గ్రామ సర్పంచ్ తోట మమత-మధు, పోలంపల్లి సర్పంచ్ బొజ్జ తిరుపతి, మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, సర్పంచ్ రావుల రమేష్, ఆత్మ కమిటీ చైర్మన్ పాశం అశోక్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎలుక ఆంజనేయులు, పొన్నం అనిల్ గౌడ్ లతో పాటు స్థానిక ప్రజాప్రతిని ధులు, అధికారులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News