Saturday, November 15, 2025
HomeతెలంగాణRation Card: రేషన్‌ కార్డుదారులకు బిగ్‌ అప్‌డేట్‌.. వెంటనే ఈ పని చేయండి.. లేదంటే మీ...

Ration Card: రేషన్‌ కార్డుదారులకు బిగ్‌ అప్‌డేట్‌.. వెంటనే ఈ పని చేయండి.. లేదంటే మీ రేషన్‌ కట్‌..!

Ration Card Holders Needs to do These Things: ప్రస్తుతం కాలంలో రేషన్ కార్డుకు ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ ప్రభుత్వ పథకం పొందాలన్నా రేషన్‌ కార్డు తప్పనిసరి. రేషన్‌ కార్డు ద్వారానే ప్రభుత్వం పేదలను గుర్తిస్తోంది. దీని ద్వారా ప్రభుత్వం నిరుపేదల కోసం ప్రతి నెలా బియ్యం పంపిణీ చేస్తుంది. అయితే, రేషన్ కార్డులు ఉన్నప్పటికీ బియ్యం తీసుకోని వారు చాలా మంది ఉన్నారు. వారికి రేషన్‌ కార్డు జారీ చేసినప్పటికీ ఎలాంటి రేషన్‌ సరుకులు తీసుకోని వారు చాలా మందే ఉన్నారు. అలాంటి వారిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయి. అలాంటి వారిని అనర్హులుగా గుర్తించేందుకు సర్వే నిర్వహిస్తోంది. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం కూడా రేషన్ తీసుకునే ప్రతి లబ్ధిదారుడు తప్పనిసరిగా ఒక పని చేయాలని సూచిస్తుంది. రేషన్ కార్డు వినియోగదారులు రేషన్ కార్డును పక్కదారి పట్టకుండా ఉండడం కోసం ఈ-కేవైసీ తప్పనిసరిగా నమోదు చేయాలని ప్రభుత్వం పేర్కొంది. రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యులు మరణించినా రేషన్ పొందుతున్న వాళ్ళు, పెళ్లి చేసుకుని వెళ్లిన ఆడపిల్లల పేర్లు తొలగించకుండా బియ్యాన్ని పొందుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు.

- Advertisement -

ఈ-కేవైసీ చేయించకుంటే రేషన్‌ కట్‌..

ఈ నేపథ్యంలో ప్రతి నెల వందల క్వింటాళ్ళ బియ్యం దుర్వినియోగం అవుతున్నాయని ప్రభుత్వం గుర్తించింది. ఈ-కేవైసీ ప్రక్రియను తప్పనిసరి చేసింది. ఈ-కేవైసీ నమోదు చేసుకోవడానికి ఇప్పటికే చాలాసార్లు అవకాశాలు ఇచ్చినప్పటికీ ఇంకా చాలామంది ఈ-కేవైసీ పూర్తి చేయలేదు. కొత్తగా రేషన్ కార్డులు పొందిన కుటుంబాలు కూడా తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
రేషన్‌ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఈ-కేవైసీ చేసుకోవడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేస్తోంది. ఈ-కేవైసీ పూర్తి చేయకపోతే ఆరు నెలల తర్వాత వారి కోటా బియ్యం తగ్గుతుందని స్పష్టం చేస్తోంది. అంటే, వరుసగా ఆరు నెలల పాటు ఈ-కేవైసీ చేయించుకోని లబ్ధిదారులు రేషన్ కోల్పోతారని నిబంధనల ప్రకారం స్పష్టం చేస్తోంది. అయితే, ఇంకా కొన్ని రేషన్ కేంద్రాలలో ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తికావడం లేదని డీలర్లు చెబుతున్నారు. ఇక, చాలా మంది ఆధార్‌ కార్డులను అప్‌డేట్‌ చేసుకోలేదు. అటువంటి వారు ఆధార్ కేంద్రాల చుట్టూ తిరుగుతూ ఆధార్ అప్‌డేషన్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇటు ఆధార్ అప్డేషన్, రేషన్ షాప్‌లలో ఈ-కేవైసీ రెండూ అప్‌డేట్‌ కాకపోవడంతో రేషన్ కోల్పోయే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. వెంటనే ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ-కేవైసీ చేయించుకోనివారు రేషన్ కోల్పోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad