Saturday, November 15, 2025
HomeతెలంగాణPalabhishekam to KCR pic: కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన రేషన్ డీలర్లు

Palabhishekam to KCR pic: కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన రేషన్ డీలర్లు

తమ కమిషన్ పెంచటం ఆనందం వ్యక్తంచేస్తున్న డీలర్స్

టన్ను బియ్యానికి 900రూ. నుండి 1400రూ. లకు కమిషన్ ను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో హర్షం వ్యక్తం చేస్తూ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ రేషన్ డీలర్లు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి* గారితో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, వారి పరిపాలనకు కృతజ్ఞతలు తెలియజేసి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పాటు సమయంలో డీలర్లకు కేవలం టన్ను బియ్యానికి 200రూ. కమిషన్ వచ్చేదని, ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద మనసుతో ఏకంగా 900 రూ. నుండి 1400రూ. లకు పెంచారని అన్నారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్లు ముఖ్యమంత్రి కేసీఆర్ కి రుణపడి ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రయ్య, పీఏసిఎస్ చైర్మన్ పుల్లా రెడ్డి, నాయకులు రమేష్ గౌడ్, చక్రవర్తి గౌడ్, సర్పంచ్ కిరణ్, మండలాల రేషన్ డీలర్ల ప్రెసిడెంట్లు పి.యాదయ్య, వై.భానుచందర్ గౌడ్, ఎల్.మాధవ రెడ్డి, ఏ.రాజు గౌడ్, డీలర్లు ఎం.నవీన్, నాయుకులు రమేష్ గౌడ్, జాంగా రెడ్డి, అమరెండర్ రెడ్డి, జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad