Sunday, November 16, 2025
HomeతెలంగాణRation Shops: రేపటి నుంచి యథావిధిగా బియ్యం పంపిణీ.. రేషన్‌ షాపుల బంద్‌ ప్రచారంపై డీలర్ల...

Ration Shops: రేపటి నుంచి యథావిధిగా బియ్యం పంపిణీ.. రేషన్‌ షాపుల బంద్‌ ప్రచారంపై డీలర్ల సంఘం క్లారిటీ

- Advertisement -

Ration Shops close in Telangana: గతకొంత కాలంగా తమ సమస్యలు తీర్చాలంటూ తెలంగాణ రేషన్‌ డీలర్లు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అక్టోబర్‌ 1 నుంచి రేషన్‌ షాపుల బంద్‌ కానున్నాయనే వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఈ వార్తలు చూసి ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టారు రాష్ట్ర రేషన్‌ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బత్తుల రమేశ్‌. రేషన్‌ షాపుల బంద్పై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఙప్తి చేశారు. యథావిథిగా రేషన్పంపిణీ చేస్తామన్నారు. కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. కాగా, ఐదు నెలలుగా కమిషన్ డబ్బులు, గన్నీ బ్యాగుల బిల్లులు ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రేషన్డీలర్లు గత కొంతకాలంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుకాణాల అద్దెలు, సిబ్బంది జీతాలు కూడా అప్పులు చేసి చెల్లిస్తున్నామని వాపోతున్నారు. నేపథ్యంలోనే ఆగస్టు 31లోగా బకాయిలు చెల్లించకపోతే సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపులను మూసివేస్తామని గతంలోనే హెచ్చరించారు. అందుకు అనుగుణంగా సెప్టెంబర్ 2న ఆర్డీవో కార్యాలయాల వద్ద, 3న కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించారు. అయినప్పటికీ, ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. మరోవైపు, కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో చేసిన హామీ మేరకు డీలర్లకు నెలకు రూ. 5 వేల గౌరవ వేతనం ఇవ్వడం, ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.140 ఇస్తున్న కమీషన్‌ను రూ.300కి పెంచడం వంటి హామీలను నెరవేర్చాలని కోరుతోంది.కాగా, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నెల సుమారు రూ. 25 కోట్ల చొప్పున, ఐదు నెలల బకాయిలు రూ. 125 కోట్లకు చేరాయని రేషన్డీలర్ల సంఘం వెల్లడించింది. ఆ డబ్బులు విడుదల చేయకపోతే సన్న బియ్యం పంపిణీని పూర్తిగా బహిష్కరిస్తామని డీలర్లు హెచ్చరించారు.

తెలంగాణలో 89.95 లక్షలకు చేరిన రేషన్కార్డులు..

కాగా, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 89.95 లక్షల రేషన్కార్డులు ఉన్నాయి. వీటి ద్వారా.. 2.81 కోట్ల మంది లబ్దిదారులు ప్రయోజనం కలుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించింది. అప్పటి నుంచి కొత్తగా చాలా మంది దరఖాస్తు చేసుకుంటున్నారు. కొత్తగా కార్డు వచ్చిన వారికి సైతం సన్న బియ్యం అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. లబ్ధిదారుల సంఖ్యకు తగ్గట్లుగా ఎప్పటికప్పుడు బియ్యం అవసరం ఎంత అనే దానిపై లెక్కలు వేసుకొని తెప్పిస్తున్నారు. ఇందులో భాగంగానే.. జూన్ నెలలో ఒకేసారి 3 నెలల బియ్యం ఇచ్చారు. అది చూసి చాలా మందికి ప్రభుత్వంపై నమ్మకం కలిగింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రేషన్కార్డుల నమోదు ప్రక్రియ జోరుగా సాగుతోంది. గత పదేళ్ల బీఆర్ఎస్ప్రభుత్వంలో రేషన్కార్డులు ఇవ్వనందున కాంగ్రెస్ప్రభుత్వంలో చాలా మంది దరఖాస్తులు చేసుకుంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad