Friday, April 4, 2025
HomeతెలంగాణRavichandra: రోడ్ల విస్తరణ చేయాలంటూ గడ్కరీకి విజ్ఞప్తి

Ravichandra: రోడ్ల విస్తరణ చేయాలంటూ గడ్కరీకి విజ్ఞప్తి

తల్లాడ-కల్లూరు-పెనుబల్లి-సత్తుపల్లి మార్గాన్ని అభివృద్ధి చేయాలని..

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. పార్లమెంటులోని మంత్రి ఛాంబర్ లో ఆయన గడ్కరీని కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో తల్లాడ-కల్లూరు-పెనుబల్లి-సత్తుపల్లి మార్గాన్ని మరింత విస్తరిస్తూ, అభివృద్ధి పరుస్తూ,సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాల్సిందిగా వినతిపత్రం అందజేశారు. ఇందుకు అవసరమైన నిధులను మంజూరు చేయవలసిందిగా ఎంపీ రవిచంద్ర కోరగా, మంత్రి గడ్కరీ వెంటనే సానుకూలంగా స్పందిస్తూ అధికారులకు తగు ఆదేశాలిచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News