Sunday, September 8, 2024
HomeతెలంగాణRayaparthi: డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పరిశీలించిన ఎర్రబెల్లి

Rayaparthi: డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పరిశీలించిన ఎర్రబెల్లి

క్షణం తీరిక లేకుండా గడుపుతున్న ఎర్రబెల్లి

రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలో సుడిగాలి ప‌ర్య‌ట‌న చేశారు. ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. వ‌రంగ‌ల్ జిల్లా పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం రాయ‌ప‌ర్తిలో ఎర్ర‌బెల్లి ట్ర‌స్టు ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న ఉచిత‌ డ్రైవింగ్ లైసెన్సులను జారీ చేశారు. వాటిని ల‌బ్దిదారుల‌కు పంపిణీ చేశారు. అలాగే, క‌ళ్యాణ లక్ష్మీ,షాదీ ముబార‌క్‌, సిఎంఆర్ ఎఫ్ చెక్కుల‌ను పంపిణీ చేశారు. తొర్రూరు మండ‌లం ఎలిక‌ట్టె క్ల‌స్ట‌ర్ ప‌రిధిలోని నాంచారి మ‌డూరులో ఎర్ర‌బెల్లి ట్ర‌స్టు ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న ఉచిత కుట్టు శిక్ష‌ణ కేంద్రాన్ని ప‌రిశీలించారు. మ‌హ‌బూబాబాద్ మండ‌లం పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం తొర్రూరులో దివ్యాంగుల‌కు పెంచిన మొత్తానికి పెన్ష‌న్ల‌ను పంపిణీ చేశారు. తొర్రూరులో నిర్మించ‌నున్న 100 ప‌డ‌క‌ల వైద్య‌శాల కోసం స్థ‌లాన్ని ప‌రిశీలించారు. అనంత‌రం జ‌న‌గామ జిల్లా నియోజ‌క‌వ‌ర్గ కేంద్రం పాల‌కుర్తిలో దివ్యాంగుల‌కు పెంచిన మేర‌కు పెన్ష‌న్లు అంద‌చేశారు. పార్టీలో చేరిన ప‌లువురికి గులాబీ కండువాలు క‌ప్పి ఆహ్వానించారు. అనంత‌రం బ‌మ్మెర గ్రామంలో అయిల‌య్య‌, జోగు వంశీల‌ను ప‌రామ‌ర్శించారు. ఆత‌ర్వాత పాల‌కుర్తి మండ‌లం వ‌ల్మీడిలో వ‌చ్చే నెల 4వ తేదీన పునః ప్ర‌తిష్టాప‌న‌, ప్రారంభోత్స‌వం చేయ‌నున్న శ్రీ సీతారామ‌చంద్ర రామ‌స్వామి దేవాల‌యానికి సంబంధించిన ప్ర‌చార ర‌థాన్ని ఎక్క‌డి ప్ర‌చారం జ‌రుగుతున్న తీరును ప‌రిశీలించారు. ఆత‌ర్వాత స్టేష‌న్ ఘన్ పూర్ నియోజ‌క‌వ‌ర్గంలో బిఆర్ ఎస్ అభ్య‌ర్థి క‌డియం శ్రీ‌హ‌రి నిర్వ‌హించిన ర్యాలీలో పాల్గొని, ఆయ‌న‌ను అభినందించారు. ఆయ‌న విజ‌యం త‌థ్య‌మ‌ని, అందుకు ప్ర‌జ‌లంతా స‌హ‌క‌రించాల‌ని పిలుపునిచ్చారు.

- Advertisement -

రాయ‌ప‌ర్తిలో…
రాయ‌ప‌ర్తిలో ఎర్ర‌బెల్లి ట్ర‌స్టు ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న యువ‌త‌కు ఉచిత డైవింగ్ లైసెన్సుల కేంద్రాన్ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ప‌రిశీలించారు. ఈ రోజు లైసెన్సులు వ‌చ్చిన వారికి మంత్రి స్వ‌యంగా పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఉషా దయాకర్ రావు గారి నేతృత్వంలో నిర్వహిస్తున్న ఎర్రబెల్లి ట్రస్టు వైద్య ఆరోగ్య శిబిరాలతో పాటు కరోనా కష్టకాలంలో నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ, ఉచిత కుట్టు శిక్షణ, ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ, ఉపాధి హామీ కూలీలకు లంచ్ బాక్సుల పంపిణీ, నిరుద్యోగ యువతకు ఉచిత ఉపాధి, ఉద్యోగ శిక్షణ, తాజాగా యువతకు డ్రైవింగ్ లైసెన్సుల పంపిణీ వంటి పలు కార్యక్రమాలను దిగ్విజయంగా చేపట్టినట్లు తెలిపారు. ఈ సేవా కార్యక్రమాలకు తమ వద్ద డబ్బు లేనప్పటికీ మిత్రులు శ్రేయోభిలాషులు తమ కుటుంబ సభ్యులు తన పిల్లలు ఇస్తున్న డబ్బులతో ఇవన్నీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తాను నిరంతరం ప్రజా సేవలో ఉంటూ, ప్రజలకు అందుబాటులో ఉంటూనే వారి ఆదరాభిమానాలతో ఎమ్మెల్యేగా గెలుస్తూ ఇవాళ మంత్రిగా ఉన్నానని ఇదంతా ప్రజల ఆశీర్వాదమేనని తెలిపారు. ప్రజల ఆశీర్వాదాలు తనకి ఎప్పుడు ఉంటాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

అనంత‌రం క‌ళ్యాణ లక్ష్మీ, షాదీ ముబార‌క్, సిఎంఆర్ ఎఫ్ చెక్కుల‌ను పంపిణీ చేశారు. సీఎం కెసిఆర్ పాల‌న‌లో సంక్షేమ‌, అభివృద్ధిల‌ను వివ‌రించారు. నిరుపేద‌ల‌కు ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌ని, ప్ర‌భుత్వానికి అండ‌గా ప్ర‌జ‌లు నిల‌వాల‌ని ఆయ‌న కోరారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆయా గ్రామాలకు చెందిన డ్రైవింగ్ లైసెన్సులు పొందిన అభ్యర్థులు, సంబంధిత శాఖకు చెందిన అధికారులు, పలువురు ప్రజలు, పార్టీ ప్రముఖులు, కార్యకర్తలు, ప్రత్యేకించి యువకులు పాల్గొన్నారు.

తొర్రూరులో…
తొర్రూరు మండ‌లం ఎలిక‌ట్టె క్ల‌స్ట‌ర్ ప‌రిధిలోని నాంచారి మ‌డూరులో ఎర్ర‌బెల్లి ట్ర‌స్టు ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న ఉచిత కుట్టు శిక్ష‌ణ కేంద్రాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సందర్శించి, పరిశీలించారు. ఈ సందర్భంగా కుట్టు శిక్షణ జరుగుతున్న తీరును పరిశీలించి తగు సూచనలు చేశారు. శిక్షణ జరుగుతున్న తీరును మహిళలను అడిగి తెలుసుకున్నారు. ఎర్రబెల్లి ట్రస్టు చేస్తున్న సేవలను మంత్రి మహిళలకు వివరించారు. సందర్భంగా మహిళల కోరిక మేరకు వారితో ఫోటోలు దిగారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలన్న సంకల్పంతో తమ ఎర్రబెల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణతో పాటు ఉచితంగా కుట్టు మిషన్లు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. మహిళలు బాగుపడ్డప్పుడే దేశం బాగుపడుతుందని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు మహిళలు ఉన్నారు.

తొర్రూరు, పాల‌కుర్తిల‌లో… దివ్యాంగుల‌కు పెంచిన‌ పెన్ష‌న్ల పంపిణీ
మ‌హ‌బూబాబాద్ మండ‌లం పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం తొర్రూరులో, అనంత‌రం జ‌న‌గామ జిల్లా నియోజ‌క‌వ‌ర్గ కేంద్రం పాల‌కుర్తిలో దివ్యాంగుల‌కు పెంచిన మొత్తానికి సంబంధించిన‌ పెన్ష‌న్ల‌ను పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు మాట్లాడుతూ, తెలంగాణ‌లో ఇస్తున్న పెన్ష‌న్లు
దేశంలో ఎక్క‌డా ఇవ్వ‌డంల‌దేన్నారు. సంఖ్య‌లోనేగాక‌, ఇచ్చే పెన్ష‌న్ మొత్తంలోనూ అత్య‌ధికంగా మ‌న రాష్ట్ర‌మే ఇస్తుంద‌న్నారు. సీఎం కెసిఆర్ మ‌న‌సున్న మ‌హారాజు, అందుకే ఆయ‌న మావ‌నీయ కోణంలో పెన్ష‌న్లు ఇస్తున్నారు. దాదాపు 40ల‌క్ష‌ల మందికి పైగా పెన్ష‌న్లు అందుతున్నాయ‌న్నారు. ఒంటి మ‌హిళ‌లు, బీడీ కార్మికులు, ఎయిడ్స్‌, బోద‌కాలు, డ‌యాల‌సిస్ పేషంట్లకు కూడా పెన్షన్లు ఇస్తున్నామ‌న్నారు. దివ్యాంగుల‌కు 4వేల‌కు పెంచిన పెన్ష‌న్లు పంపిణీ చేశారు. బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్క‌డా ఇంత పెద్ద మొత్తంలో పెన్ష‌న్లు అంద‌డంలేద‌న్నారు. త‌ల్లికి అన్నం పెట్ట‌ని వాడు చిన్న‌మ్మ‌కు బంగారుగాజులు చేయిస్తామంటే న‌మ్మ‌వ‌చ్చా? అని ప్ర‌శ్నించారు. ఇత‌ర రాష్ట్రాల్లో పెన్షన్ల వివరాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు దివ్యాంగ పెన్ష‌న్ దారులు మాట్లాడుతూ, సీఎం కెసిఆర్ ను, ప్ర‌భుత్వాన్ని, మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుని అభినందించారు. త‌మ‌కు పెన్ష‌న్లు వ‌స్తున్నాయ‌ని, స‌మాజంలో, ఇంట్లో గౌర‌వం పెరిగింద‌ని, ఆత్మ గౌర‌వంతో బ‌తుకుతున్నామ‌ని అన్నారు. త‌మ జ‌న్మంతా సీఎం కెసిఆర్ కు, మంత్రి ఎర్ర‌బెల్లికి రుణ ప‌డి ఉంటామ‌న్నారు.

100 ప‌డ‌క‌ల వైద్య‌శాల‌కు స్థ‌ల ప‌రిశీల‌న‌
తొర్రూరులో నిర్మించ‌నున్న 100 ప‌డ‌క‌ల వైద్య‌శాల కోసం స్థ‌లాన్ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ప‌రిశీలించారు. త్వ‌ర‌లోనే శంకుస్థాప‌న చేయించి, నిర్మాణం మొద‌లు పెడ‌తామ‌ని చెప్పారు. సాధ్య‌మైనంత వేగంగా ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తెస్తామ‌ని హామీ ఇచ్చారు.

కాంగ్రెస్ నుంచి బి అర్ ఎస్ లోకి…
గులాబీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించిన మంత్రి ఎర్రబెల్లి
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడ‌కండ్ల మండ‌లం ఏడునూతుల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీటీసీ కర్నె వీరసోములు, బీజేపీ కి చెందిన గ్రామ నాయకుడు ఉప్పునూతల వీర సోములు ఆ పార్టీకి రాజీనామా చేసి, బిఆర్ ఎస్ పార్టీలో చేరారు. వారికి రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో సీఎం కెసిఆర్ ప్రభుత్వం, పాలకుర్తి నియోజకవర్గం లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలకు తాము ఆకర్షితులమై, అభివృద్ధిలో భాగస్వాములము కావడానికి బి అర్ ఎస్ లో చేరుతున్నట్లు చెప్పారు. మన ప్రాంతంలో ఎర్రబెల్లి దయాకర్ రావు చేస్తున్న అభివృద్ధి ని చూసి రాబోయే ఎన్నికల్లో దయన్న అధిక మెజారిటీ తో గెలిపించే0దుకు తన వంతు బాధ్యతగా పని చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలియజేసారు. పార్టీలో కొత్తగా చేరిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు కీసర ఉమేందర్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు ఎన్ సోమయ్య, ప్రాథమిక పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ మురారి శెట్టి సమ్మయ్య, మాజీ చైర్మన్ కిషన్ గౌడ్, రామిండ్ల అయిలయ్య, శ్రీరాముల యాకయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News