రేకుర్తి గుట్టపై నూతనంగా నిర్మిస్తున్న లక్ష్మీ నర్సింహా స్వామి ఆలయ పునరుద్దరణ పనుల పురోగతిని మంత్రి గంగుల కమలాకర్ సమీక్షించారు. ఇక్కడ జరుగుతున్న పనులు చాలా మందకొడిగా సాగుతున్నాయని గంగుల ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈనెల 24న ఆలయ గోపురం, గడప కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. నెలన్నర రోజుల్లోగా పనులు పూర్తి చేసి స్వామి వారి దర్శనానికి సిద్దం చేయాలంటూ అధికారులను మంత్రి గంగుల ఆదేశించారు.
భక్తుల మనోభావాలకు అనుగుణంగా ప్రాచీన ఆలయాలకు పూర్వ వైభవం తీసుకువస్తామన్నారు. ఇందుకోసం ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టేందుకు వెనుకాడబోమన్నారు. రేకుర్తిలోని లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయాన్ని యాదాద్రికి ధీటుగా గొప్పక్షేత్రంగా తీర్చిదిద్దుతానని పునరుద్ఘాటించారు.