MLA Gopinath| జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్( MLA Gopinath)కు సుప్రీంకోర్టు(Supreme Court)లో భారీ ఊరట కలిగింది. మాగంటి ఎన్నిక చెల్లదంటూ మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత మహ్మద్ అజారుద్దీన్(Azharuddin) దాఖలు చేసిన పిటిషన్‌పై కీలక తీర్పునిచ్చింది. అజారుద్దీన్ పిటిషన్‌పై హైకోర్టులో జరుగుతున్న విచారణపై స్టే విధించింది. అలాగే అజారుద్దీన్‌కు నోటీసులు జారీ చేసింది. మాగంటి ఎన్నిక చెల్లదనే దానికి సరైన ఆధారాలు లేవంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మాగంటికి ఊరట లభించింది.
కాగా గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపినాథ్, కాంగ్రెస్ అభ్యర్థిగా అజారుద్దీన్ పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో మాగంటి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే మాగంటి ఎన్నిక చెల్లదంటూ అజారుద్దీన్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో మాగంటి సైతం తన ఎన్నికల చెల్లదు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని.. ఈ పిటిషన్ కొట్టేయాలని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. అజారుద్దీన్ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో ఆయన హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. తాజాగా సుప్రీంకోర్టులో సైతం ఆయనకు నిరాశే ఎదురైంది.