Friday, September 27, 2024
HomeతెలంగాణRema Rajeswari: పార్వతీ బ్యారేజ్, సరస్వతి పంప్ హౌస్, బొక్కల వాగును పరిశీలించిన రామగుండం...

Rema Rajeswari: పార్వతీ బ్యారేజ్, సరస్వతి పంప్ హౌస్, బొక్కల వాగును పరిశీలించిన రామగుండం సీపీ

ముంపుకు గురవ్వకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోండి

రామగుండం పోలీస్ కమిషనరేట్ గోదావరిఖని సబ్ డివిజన్ మంథని పోలీస్ స్టేషన్ పరిధిలోని పార్వతీ బ్యారేజ్, సరస్వతి పంప్ హౌస్ లని రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఐపిఎస్., (డిఐజి), మంచిర్యాల డీసీపీ సుదీర్ రాంనాథ్ కేకన్ ఐపిఎస్., పెద్దపల్లి డీసీపీ వైభవ్ గైక్వాడ్ ఐపిఎస్ లతో కలిసి పరిశీలించారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా పంప్ హౌస్ లోకి భారీ వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉండడంతో పంప్ హౌస్, ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి నీటిమట్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు, మంథని పట్టణంలోని బొక్కల వాగును పరిశీలించారు. వరదనీటి కారణంగా గోదావరి పరివాహక ప్రాంతాలు ముంపుకు గురయ్యే అవకాశం ఏమైనా ఉంటే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఉన్నట్లయితే వెంటనే అధికారులకు తెలియజేయాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీ వెంట గోదావరిఖని ఏసీపీ తులా శ్రీనివాస్, మంథని సీఐ సతీష్, ఎస్ఐ ఆది మధుసూదన్, రామగిరి ఎస్ఐ రవి ప్రసాద్ ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News