ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మాజీ భార్య, నటి రేణు దేశాయ్(Renu Desai) సోషల్ మీడియాలోయాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులు పెడుతూ ఉంటారు. వర్తమాన అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తారు. ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూముల వేలంపై ఆమె స్పందించారు. దయచేసి వందలాది చెట్లను నరికివేయకండని.. భవిష్యత్‌లో పిల్లలకు ఆక్సిజన్ లేకుండా చేయవద్దని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తూ పోస్ట్ పెట్టారు.
తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) వీడియోతో సంచలన పోస్ట్ షేర్ చేశారు. తాము మళ్లీ అధికారంలోకి రాగానే హెచ్‌సీయూలోని 400 ఎకరాల భూమిని అతిపెద్ద ఎకో పార్క్‌లాగా మారుస్తాం అని కేటీఆర్ చెప్పడంపై విమర్శలు గుప్పించారు. ‘‘వారి చేతిలో పవర్ ఉన్నప్పుడు ఎకో పార్క్ చేయలేదు. కానీ ఇప్పుడు 5 రోజుల్లో 100 ఎకరాల అడవి పోయింది. ఇప్పుడు కొత్త ఓట్ల కోసం ఇదంతా మాట్లాడుతున్నారు’’ అని తెలిపారు. ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
