Friday, October 18, 2024
HomeతెలంగాణGarla: రేణుక చౌదరిని సన్మానించిన కాంగ్రెస్ శ్రేణులు

Garla: రేణుక చౌదరిని సన్మానించిన కాంగ్రెస్ శ్రేణులు

గార్ల అభివృద్ధికి కృషి చేస్తానన్న రేణుక

కాంగ్రెస్ పార్టీ నుండి, రాజ్యసభకు నామినేషన్ సమర్పించిన రేణుక చౌదరిని హైద్రాబాద్ లోని కాంగ్రెస్ కార్యాలయంలో గార్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రావూరి వెంకట్రామయ్య మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్లపల్లి కృష్ణలు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ గతంలో అనేకసార్లు రాజ్యసభకు ఎంపీగా ఎన్నికైన రేణుకా చౌదరి గార్ల మండల అభివృద్ధికి కృషి చేశారని, భవిష్యత్తులో కూడా గార్ల మండల అభివృద్ధికి కృషి, చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మహిళా నాయకురాలు శంషాద్ బేగం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, దుద్దుకూరు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News