Saturday, November 15, 2025
HomeతెలంగాణNTR Ghat: ప్రభుత్వం నిధులతో ఎన్టీఆర్‌ ఘాట్‌కు మరమ్మత్తులు

NTR Ghat: ప్రభుత్వం నిధులతో ఎన్టీఆర్‌ ఘాట్‌కు మరమ్మత్తులు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ సీఎం, విశ్వవిఖ్యాత నటుడు నందమూరి తారకరామారావు(NTR) వర్ధంతి, జయంతిని హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌(NTR Ghat)లో ప్రతి ఏటా ఘనంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కుటుంబసభ్యులతో పాటు నాయకులు, అభిమానులు ఈ ఘాట్‌ను సందర్శించి నివాళులర్పిస్తూ ఉంటారు. అయితే ఇటీవల ఆయన వర్థంతి సందర్భంగా నివాళి అర్పించేందుకు వచ్చిన ఏపీ మంత్రి నారా లోకేష్(Nara Lokesh).. ఘాట్ నిర్వహణ సరిగా లేకపోవడంపై తీవ్ర అసంతృప్తి చేశారు.

- Advertisement -

తన సహాయక సిబ్బందికి చెప్పి సొంత నిధులతో మరమ్మత్తులు నిర్వహించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఘాట్‌కు ఎందుకు మరమ్మత్తులు చేయడం లేదంటూ అభిమానులు తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్పందించిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మరమ్మత్తులు చేయించే బాధ్యత తాను తీసుకుంటానని తెలిపారు. అనంతరం ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో HMDA కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ నిధులతో ఘాట్‌కు మరమ్మత్తులు చేయాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad