నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట గ్రామ సమీపంలోని ఎస్ఎల్బీసీ టన్నెల్‌లో(SLBC Tunnel) ఫిబ్రవరి 22న ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు మృతి చెందిన సంగతి తెలిసిందే. మృతదేహాల గుర్తింపు కోసం సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. తాజాగా తవ్వకాలు జరుపుతుండగా లోకో ట్రాక్ వద్ద మరో మృతదేహం ఆనవాళ్లు లభ్యమయ్యాయి. కన్వేయర్ బెల్ట్‌కి 50 మీటర్ల దూరంలో రెస్క్యూ సిబ్బంది మరో మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహాన్ని వెలికితీసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వెలికితీశాక ఈ డెడ్‌బాడీ వివరాలను అధికారులు ప్రకటించనున్నారు.
ప్రస్తుతం ఐఏఎస్ శివశంకర్ ఆధ్వర్యంలో సహాయక చర్యలు శరవేగంగా జరుగుతున్నాయి. సోమవారం సీఎం రేవంత్ రెడ్డి (CM Revath Reddy) కూడా సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలను ముమ్మరం చేసి మృతదేహాలను వెలికి తీసేందుకు కృషి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా టన్నెల్‌లో ఇప్పటివరకు రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇటీవలే ఒకరి మృతదేహం దొరికిన విషయం విధితమే. మరో ఆరుగురి మృతదేహాల కోసం సహయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.