Friday, November 22, 2024
HomeతెలంగాణTPCC: కాంగ్రెస్ పదవులకు రాజీనామా చేసిన రేవంత్ వర్గం.. పాదయాత్రకు సిద్ధమవుతున్న రేవంత్

TPCC: కాంగ్రెస్ పదవులకు రాజీనామా చేసిన రేవంత్ వర్గం.. పాదయాత్రకు సిద్ధమవుతున్న రేవంత్

TPCC: రేవంత్ రెడ్డి వర్గానికే కాంగ్రెస్ పార్టీ పదవులు దక్కాయని పార్టీ సీనియర్లు చేస్తున్న విమర్శలకు ఆ వర్గం నేతలు చెక్ పెట్టారు. టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ వర్గానికి చెందిన 13 మంది నేతలు తమ పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ఆదివారం సాయంత్రం తమ రాజీనామా లేఖలను రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్కం ఠాకూర్‌కు పంపారు. ఆదివారం గాంధీ భవన్‌లో జరిగిన పార్టీ సమావేశం అనంతరం నేతలు ఈ నిర్ణయం తీసుకున్నారు.

- Advertisement -

రాజీనామా చేసిన నేతల్లో సీతక్క, పటేల్ రమేశ్ రెడ్డి, సత్తు మల్లేష్, వేం నరేందర్ రెడ్డి, విజయ రమణారావు, జంగయ్య యాదవ్, సుభాష్ రెడ్డి, దొమ్మాటి సాంబయ్య, మధుసూధన్ రెడ్డి, డా.సత్య నారాయణ, చారగొండ వెంకటేశ్, ఎర్ర శేఖర్ వంటి నేతలున్నారు. ఈ నిర్ణయంతోనైనా సీనియర్ నేతలు శాంతిస్తారేమో చూడాలి. ఇటీవల ప్రకటించిన పీసీసీ పదవుల్లో ఎక్కువగా రేవంత్ వర్గానికే పదవులు దక్కాయి. దీంతో తమకు, తమ వర్గానికి ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై పార్టీ సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పావులు కదిపారు. రేవంత్ సమవేశాలు, కార్యక్రమాల్ని బహిష్కరించాలని నిర్ణయించారు. దీంతో పార్టీ తీరు రేవంత్ రెడ్డి వర్సెస్ సీనియర్ నేతలు అన్నట్లుగా తయారైంది.

ఒకవైపు విమర్శలు వస్తున్నప్పటికీ రేవంత్ తగ్గడం లేదు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేయబోతున్నాడు. ‘హాత్ సే హాత్ జోడో’ పేరుతో వచ్చే నెల 26 నుంచి ఈ యాత్ర చేపట్టబోతున్నాడు. రెండు నెలలపాటు ఈ యాత్ర సాగనుంది. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ సిద్ధమవుతోందని, గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఈ యాత్ర సాగుతుందని రేవంత్ తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News