భారత్- పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ద వాతావరణం నెలకొన్న వేళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) కీలక నిర్ణయం తీసుకున్నారు. పాక్ దాడులపై వీరోచితంగా పోరాడుతున్న భారత సైన్యానికి అండగా నిలవాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా నేషనల్ డిఫెన్స్ ఫండ్‌కు విరాళాలు ఇవ్వాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రతిపాదించారు. ఇందుకోసం ఒక నెల వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఈమేరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విరాళాన్ని ప్రకటించనున్నారు. మరోవైపు ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం ముందుకు రావాలని రేవంత్ రెడ్డి కోరారు.