అమరవీరుల స్థూపం వద్ద రేవంత్ ను అరెస్టు చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు సిఎల్పీ కి వచ్చిన రేవంత్ రెడ్డి అక్కడ నుండి ఒంటిగంటకు అమరవీరుల స్తూపం వద్దకు బయలుదేరారు. రేవంత్ రెడ్డి గన్ పార్కు చేరక ముందే పోలీసులు గన్ పార్క్ వద్ద ముహరించారు. రెండు రోజుల క్రితం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. అమరవీరుల స్తూపం వద్ద ప్రయాణం చేయడానికి రావాలని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. అందుకు అనుగుణంగా మధ్యాహ్నం ఒంటిగంటకు అమరవీరుల స్తూపం వద్దకు అనుచరులతో కలిసి రేవంత్ రెడ్డి వచ్చారు. సిద్ధమ హాని కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. గన్ పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్తూపం వద్దకు భారీగా కార్యకర్తలతో కలిసి రావడంతో పోలీసులు అడ్డుకున్నారు. దాదాపు పావుగంటకు పైగా పోలీసులతో రేవంత్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున కార్యక్రమాలను అనుమతించలేమని పోలీసులు వివరించారు. గన్ పార్క్ వద్దకు వెళ్లి తీర్థమని చెప్పడంతో అందుకు పోలీసులు అంగీకరించలేదు. చివరకు పోలీసుల వాహనంలో రేవంత్ రెడ్డిని తరలించారు.