Friday, November 22, 2024
HomeతెలంగాణRevanth Reddy: మహాబుద్ధ విహారలో సీఎం రేవంత్

Revanth Reddy: మహాబుద్ధ విహారలో సీఎం రేవంత్

గొప్ప క్షేత్రాన్ని సందర్శించా

బుద్ధ పౌర్ణిమ సందర్భంగా సికింద్రాబాద్ లోని మహాబుద్ధ విహారను సందర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం మాట్లాడిన ఆయన.. గొప్ప క్షేత్రాన్ని సందర్శించిన అనుభూతి కలిగిందని చెప్పుకొచ్చారు. రాజ్యం, అధికారం ఉండి వాటిని కాదని 29 ఏళ్ల వయసులో శాంతి కోసం బుద్ధుడు ఆలోచించారని, రెండున్నర వేల సంవత్సరాలుగా బౌద్ధ సిద్ధాంతం నిలబడి ఉందని రేవంత్ అన్నారు.

- Advertisement -

ప్రతి పనిని ధ్యానంగా  చేయాలన్న సూచనలో చాలా అర్థం ఉందని ఈ సూక్తి నుంచి ఎంతో స్ఫూర్తిని పొందినట్టు రేవంత్ వెల్లడించారు. ఏ పని అయినా నేను ఎంతో ధ్యానంగా చేస్తానని చెప్పిన సీఎం, ధ్యాన మందిరం కోసం స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ నుంచి నిధులు మంజూరు చేస్తామన్నారు.

ఒక పాఠశాలను నిర్వహించాలని నేను కోరుతున్నా అంటూ చెప్పిన రేవంత్.. సమాజంలో అసహనం, అసూయ పెరిగిపోతున్నాయని, సమాజంలో స్పర్థలు, ఉద్వేగాలు పెరిగేలా వాతావరణం నెలకొని ఉందన్నారు. బుద్ధుని సందేశం దేశానికి ఇప్పుడు ఎంతో అవసరమని, బుద్దుని సందేశాన్ని సమాజంలో ప్రతి ఒక్కరికి చేరవేయడానికి అవసరమైన సహాయం వ్యక్తి గా, ప్రభుత్వంగా చేస్తామన్నారు.

ఈ ప్రభుత్వం మీది… అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయని,  తెలంగాణలో బుద్ధ బిక్షు లకు తగిన గౌరవం ఉంటుందన్నారు సీఎం రేవంత్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News