Saturday, November 23, 2024
HomeతెలంగాణRevanth Reddy at CII: తెలంగాణలో డ్రైపోర్ట్ ఏర్పాటు

Revanth Reddy at CII: తెలంగాణలో డ్రైపోర్ట్ ఏర్పాటు

వైఎస్, చంద్రబాబు, కేసీఆర్ సిటీ డెవలప్ చేశారు

ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడాలన్నదే మా విధానం అంటూ సీఐఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు అన్నివిధాలుగా అండగా ఉంటామన్నారు. రాజకీయాలు ఎలా ఉన్నా వైఎస్, చంద్రబాబు, కేసీఆర్ హైదరాబాద్ అభివృద్ధిని కొనసాగించారన్నారు రేవంత్. అభివృద్ధి విషయంలో మా ప్రభుత్వానికి ఎలాంటి బేషజాలు లేవని ఆయన తేల్చిచెప్పారు.

- Advertisement -

నగర అభివృద్ధి కోసం గత పాలకులు తీసుకున్న మంచి నిర్ణయాలను కొనసాగిస్తామని, తెలంగాణలో విద్య, ఉపాధి అవకాశాల కల్పనలో సీఐఐ తో కలిసి ముందుకు నడుస్తామని ఆయన స్పష్టంచేశారు. 64 ఐటీఐ లను స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లుగా రూ.2000 కోట్లలతో డెవలప్ చేయబోతున్నామన్నారు. స్కిల్లింగ్ యూనివర్సిటీల ఏర్పాటు కోసం సంప్రదింపులు జరుపుతున్నామని, స్కిల్ డెవలప్ మెంట్ లో జాయిన్ అయిన విద్యార్థులకు డిగ్రీ సర్టిపికెట్స్ ఇవ్వబోతున్నామన్నారు.

గతంలో అవుటర్ రింగ్ రోడ్ అవసరం లేదని కొందరు అన్నారు.. ఇప్పుడది హైదరాబాద్ కు లైఫ్ లైన్ గా మారిందన్న సీఎం రేవంత్.. తెలంగాణలో డ్రైపోర్ట్ ఏర్పాటు చేస్తామన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News