రంగారెడ్డి జిల్లాలోని ముఖ్యమైన షాద్ నగర్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ జెండా జెండా ఎగరేయాల్సిందేనని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి దిశా నిర్దేశం చేశారు. ఈ మేరకు షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు పల్లె ఆనంద్ ఆయన సోదరుడు పల్లె బాలిశ్వర్ గ్రామ సర్పంచ్ పల్లె స్వాతిల ఆధ్వర్యంలో గ్రామ ముఖ్య నాయకులు పార్టీలో చేరారు. పల్లె బ్రదర్స్ కాంగ్రెస్ పార్టీలోకి రావడంతో కేశంపేట మండలంలో పూర్తిగా రాజకీయ సమీకరణ మారిందని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బోణీ కొట్టబోయే మొదటి నియోజకవర్గం షాద్ నగర్ అని వీర్లపల్లి శంకర్ భారీ మెజార్టీతో గెలవబోతున్నాడని రేవంత్ రెడ్డి అన్నారు. కార్యకర్తలతో సంమయమనం చేసుకుంటూ కలిసికట్టుగా నియోజక వర్గంలో భారీ ప్రచారం చేపట్టాలని అధిష్ఠానం ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రజలకు మంచి సుపరిపాలన అందుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ మరొకరిని కలిపి వీర్లపల్లి శంకర్ గెలుపుకు దోహదపడాలని సూచించారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని పల్లె ఆనంద్ మీడియాకు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు కాశీనాథ్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, శ్రావణ్ కుమార్ రెడ్డి, అల్వాల సురేష్ రెడ్డి, ఎన్నం మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.