Saturday, November 15, 2025
HomeతెలంగాణSelf Help Groups: రేవంత్ సర్కార్ శుభవార్త.. మహిళా సంఘాలకు డ‌బ్బులు విడుదల!

Self Help Groups: రేవంత్ సర్కార్ శుభవార్త.. మహిళా సంఘాలకు డ‌బ్బులు విడుదల!

Revanth Reddy Government: రేవంత్ రెడ్డి సర్కార్ మహిళలకు గుడ్ న్యూస్‌ను వెల్లడించింది. మహిళా సంఘాలకు రూ. 6.11 కోట్ల రివాల్వింగ్ విడుదల చేసింది. దీంతో మహిళా సంఘాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. రాష్ట్రంలోని 4,079 మహిళా సంఘాలకు రేవంత్ సర్కార్ రూ. 6.11 కోట్ల రివాల్వింగ్ విడుదల చేసింది. ఒక్కో సంఘానికి రూ. 15వేల చొప్పున కేటాయించనుంది. ఈ నిధుల వినియోగాన్ని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు, జిల్లా, మండల, గ్రామ సమాఖ్యలు పర్యవేక్షించనున్నట్లుగా తెలుస్తోంది. అత్యధికంగా మహబూబాబాద్ జిల్లాలో 397 సంఘాలకు నిధులు అందనున్నాయి. అత్యల్పంగా మంచిర్యాల జిల్లాలో మూడు సంఘాలకు మాత్రమే నిధులు ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. దీంతో మహిళా సంఘాలలోని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

మహిళల కోసం అనేక పథకాలు: రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రారంభించింది. వీటిలో ముఖ్యంగా మహాలక్ష్మి పథకం ప్రధానమైనది. ఈ పథకం కింద మహిళలకు 3 ప్రధాన ప్రయోజనాలు కల్పిస్తామని ఎన్నికల ముందు మహిళలకు హామీ ఇచ్చారు. వీటిలో రెండు ఇప్పటికే అమలు చేస్తున్నారు.

ఉచిత బస్సు ప్రయాణం: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులలో మహిళలు, బాలికలు, మరియు ట్రాన్స్‌జెండర్లు రాష్ట్రం అంతటా ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ పథకంతో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉచిత ప్రయాణంలో పాటుగా మహిళ ఆర్థిక స్థితి మెరుగైదని రేవంత్ సర్కార్ వెల్లడించింది.

₹500కే గ్యాస్ సిలిండర్: అర్హులైన మహిళలకు కేవలం ₹500కే గ్యాస్ సిలిండర్ అందించేందిస్తున్నారు. ఈ పథకం ద్వారా మహిళలు పొగపొయ్యిల నుండి విముక్తి పొందారు. దీంతో వారి ఆరోగ్య స్థితి మెరుగైంది.

Also Read:https://teluguprabha.net/international-news/un-human-rights-body-reports-on-north-koreas-oppression/

స్వయం సహాయక బృందాలకు చేయూత: రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళా స్వయం సహాయక బృందాలను ప్రోత్సహిస్తోంది. ఈ బృందాలకు వడ్డీ లేని రుణాలను అందిస్తున్నారు. ఈ పథకం మహిళలు ఆర్థికంగా ఎదగడానికి సహాయం చేస్తోంది.

ఆరోగ్యశ్రీ పథకం: రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఆరోగ్య సేవలను ₹5 లక్షల నుండి ₹10 లక్షలకు పెంచారు. దీంతో మహిళలకు, వారి కుటుంబాలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి.

₹2,500 నెలవారీ ఆర్థిక సహాయం: అర్హులైన మహిళలకు నెలకు ₹2,500 ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రస్తుత రాష్ట్ర బడ్జెట్‌ ఆధారంగా ఈ పథకాన్ని అమలు చేయాలని చూస్తుంది.

అయినా అసంతృప్తిలోనే మహిళలు: రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు సరిగా అమలు చేయడంలేదని మహిళలు ఆరోపిస్తున్నారు. కొంతమంది రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని శభాష్.. అంటుంటే మరికొంతమంది తిట్టిపోస్తున్నారు. అయితే రాబోయే ఎన్నికలపై మహిళల ప్రభావం ఎలా ఉండబోతుందే వేచిచూడాల్సిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad