Friday, April 4, 2025
HomeతెలంగాణRevanth Reddy: పొంగులేటి, రాజా రమేష్ కు కాంగ్రెస్ ఆహ్వానం

Revanth Reddy: పొంగులేటి, రాజా రమేష్ కు కాంగ్రెస్ ఆహ్వానం

కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని ఆహ్వానించిన కాంగ్రెస్ బృందం

హైదరాబాద్ లో ఖమ్మం మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అద్యక్షులు యనమల రేవంత్ రెడ్డి బృందం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బృందాన్ని కాంగ్రెస్ పార్టీకి రమ్మని ఆహ్వానించడానికి వచ్చారు. ఖమ్మం జిల్లా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభ్యర్థులతో పాటూ చెన్నూరు నియోజకవర్గం నుండి పొంగులేటికి అత్యంత ఆప్తుడైన డాక్టర్ రాజా రమేష్ బాబు నియోజకవర్గంలోని నాయకులు హాజరు అయ్యారు. త్వరలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆశీస్సులతో డాక్టర్ రాజా రమేష్ బాబు ఉద్యోగానికి రాజీనామా చేసి చెన్నూరు నియోజకవర్గం నుంచి జరగబోయే ఎన్నికల్లో బరిలో ఉంటారని తెలిపారు. సింగరేణి ముద్దుబిడ్డ అయిన డాక్టర్ రాజా రమేష్ బాబుకు అటు కార్మికులతో పాటు నియోజవర్గంలోని ప్రజల ఆదరణ పొందిన వ్యక్తి కాయడం చాలా కలిసి వచ్చే అంశం. తల్లితండ్రులు ఇద్దరితో పాటు వారి బంధు మిత్రులు కూడ సింగరేణిలో ఉద్యోగం చెయ్యడం అదనంగా బలంమైన అంశం. అందరితో మంచి సంబంధాలు ఉండటం, ఆపదలో ఉన్నవారికి జీఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా అనేక మందికి సేవలు చెయ్యడం కలిసి వచ్చే అంశం. ఈ కార్యక్రమంలో చెన్నూరు నియోజకవర్గం అన్ని మండలాల నుంచి ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఆప్త మిత్రులు, జీ.ఎస్.ఆర్ ఫౌండేషన్ సభ్యులు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News