Revanth Reddy BRS Criticism : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వెంగళరావు నగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తరపున ప్రచారం చేశారు. “బీఆర్ఎస్ పార్టీ సంప్రదాయాన్ని తుంగలో తొక్కింది” అని తీవ్రంగా విమర్శించారు. పీజేఆర్ మరణం తర్వాత బీఆర్ఎస్ అభ్యర్థిని నిలబెట్టడం దుర్మార్గమని, ఈ చర్యతో పార్టీకి సానుభూతి ఓట్లు అడగే హక్కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. “కాంగ్రెస్ జెండాను ఎగురవేస్తాం. జూబ్లీహిల్స్ అభివృద్ధి చూపిస్తాం” అని సవాల్ విసిరారు.
ALSO READ: AP: ట్రావెల్స్ బస్సులపై రవాణా శాఖ ఉక్కుపాదం: గ్యారేజీలకే పరిమితమైన 600 బస్సులు
రేవంత్ మాట్లాడుతూ, “బీఆర్ఎస్ పార్టీని ఎవరూ నమ్మే స్థితిలో లేదు. గతంలో పీజేఆర్ మరణం తర్వాత దుర్మార్గంగా పోటీ పెట్టారు. కంటోన్మెంట్‌లో కూడా సెంటిమెంట్‌ను ఉపయోగించుకున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఫిక్స్‌డ్ బంధం ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో BRS బీజేపీకు సహాయం అందించింది” అని ఆరోపించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఈ ప్రాంతానికి వచ్చారా అని ప్రశ్నించారు. “బీఆర్ఎస్ నాయకులు వస్తే వాతలు పెట్టండి, ఓటు వద్దు” అని ఓటర్లకు సూచించారు. “నవీన్ గెలిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తాం” అని హామీ ఇచ్చారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో BRS తరపున మాగంటి సునీత పోటీ చేస్తోంది. కాంగ్రెస్ నవీన్ యాదవ్‌కు టిక్కెట్ ఇచ్చింది. బీజేపీ లంకల దీపక్ రెడ్డికు టికెట్ ఇచ్చింది. రేవంత్ “బీఆర్ఎస్ కోసం బీజేపీ గవర్నర్‌పై ఒత్తిడి తెస్తోంది” అని ఆరోపించారు.


