Thursday, January 15, 2026
HomeతెలంగాణRevanth Reddy: ఇసుక మాఫియాను ప్రశ్నిస్తే పోలీస్ కేసులు

Revanth Reddy: ఇసుక మాఫియాను ప్రశ్నిస్తే పోలీస్ కేసులు

జమ్మికుంట మానేరు వాగు పరివాహక ప్రాంతం నుండి కోట్లాది రూపాయల విలువగల ఇసుక మాఫియా యథేచ్ఛగా జరుగుతోందని, ఇసుక మాఫియాకు అండగా తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ కుటుంబం ఉందని టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆరోపించారు. జోడోయాత్రలో భాగంగా జమ్మికుంట, ఇల్లందకుంట మండల కేంద్రాలలో రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా అపర భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో పూజలు నిర్వహించారు. ఈ ప్రాంత ఎంపీ బిజెపి బండి సంజయ్, ఈ ప్రాంత ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇసుక మాఫియాకు ఎందుకు అడ్డు చెప్పడం లేదని రేవంత్ నిలదీశారు. టిఆర్ఎస్ ప్రభుత్వానికి భయపడి ఆపడం లేదా లేక ప్రభుత్వంతో ఒప్పందాలు ఉన్నాయా అంటూ ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు.

- Advertisement -

ఇసుక మాఫియాను అరికట్టేందుకు తెలంగాణ కాంగ్రెస్ ఉద్యమిస్తుందని, న్యాయపరంగా ఇసుక మాఫియా పై చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News