Monday, November 18, 2024
HomeతెలంగాణRevanth Reddy | మోదీ సర్కార్ కి సక్సెస్ స్టోరీ లేదు -రేవంత్

Revanth Reddy | మోదీ సర్కార్ కి సక్సెస్ స్టోరీ లేదు -రేవంత్

మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌చారం నేటితో ముగియనుంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. పార్టీ అగ్రనేతలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫైనల్ టచ్ ఇప్పిస్తున్నాయి. అందులో భాగంగా మహావికాస్ అఘాడీ తరపున ప్రచారంలో పాల్గొనేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) మరోసారి మహారాష్ట్ర వెళ్లారు. ఈ సందర్భంగా పూణేలో నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి (Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

ఆయన ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే…

  • ప‌ద‌కొండేళ్ల పాల‌న త‌ర్వాత కూడా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ ప్ర‌భుత్వానికి చెప్పుకోవ‌డానికి ఒక స‌క్సెస్ స్టోరీ లేదు.
  • ఈ ప‌ద‌కొండేళ్ల‌లో కేంద్ర ప్ర‌భుత్వానికి, ఇక్క‌డ మ‌హారాష్ట్రలోని మ‌హాయుతి ప్ర‌భుత్వానికి చెప్పుకోవ‌డానికి ఒక్క విజ‌య‌గాథ లేదు.
  • ప్ర‌తిసారి బాంబు పేలుళ్లు.. ఇత‌ర కొత్త కొత్త అంశాలను ప్రధాన‌మంత్రి మోదీ.. బీజేపీ ఎన్నిక‌ల ముందుకు తెర‌పైకి తెస్తున్నాయి.. చెప్పుకోవ‌డానికి ఏం లేక‌నే వాటిపై ఆధార‌ప‌డుతున్నారు.

  • 2014 ఎన్నిక‌ల‌కు ముందు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామ‌ని, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామ‌ని, 2002కు ముందే దేశంలోని ప్ర‌తి పేద‌వానికి ఇల్లు నిర్మిస్తామ‌ని న‌రేంద్ర మోదీ హామీ ఇచ్చారు.
  • రైతుల ఆదాయం రెట్టింపు చేయ‌క‌పోగా వారికి వ్య‌తిరేకంగా మూడు న‌ల్ల చ‌ట్టాలు తెచ్చారు.. 16 నెల‌ల పాటు రైతులు ధ‌ర్నాలు, ఆందోళ‌న‌లు చేశారు.. ఆ స‌మ‌యంలో 700 మందికిపైగా రైతులు ప్రాణాలు కోల్పోయారు.
  • దేశంలోనే అత్య‌ధికంగా మ‌హారాష్ట్రలోనే రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నారు… ఈ విష‌యంపై ప్ర‌ధాన‌మంత్రి మాట్లాడరు..?
  • నేను ఎంపీగా ఉన్న‌ప్పుడు 2 కోట్ల ఉద్యోగాల‌పై లోక్‌స‌భ‌లో ప్ర‌శ్నించా… కేవ‌లం 7.50 ల‌క్ష‌ల ఉద్యోగాలు ఇచ్చామ‌ని స‌మాధానం ఇచ్చారు…అంటే ప‌ద‌కొండేళ్ల పాల‌న‌లో ఒక్క శాతం ఉద్యోగాలు కూడా ఇవ్వ‌లేదు
  • రైతులు, పేద‌లు, ఉద్యోగాల విష‌యంలో న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంది
  • ఇచ్చిన హామీలంటిన్నిలో విఫ‌ల‌మైన న‌రేంద్ర మోదీ తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ల్లో కాంగ్రెస్ ప్ర‌భుత్వ హామీల‌పై ఆరోప‌ణ‌లు చేస్తున్నారు
  • తెలంగాణ ముఖ్య‌మంత్రి హోదాలో నేను స‌వాల్ విసురుతున్నా…. కేంద్ర మంత్రి లేదా కేంద్ర ఉన్న‌తాధికారి ఆధ్వ‌ర్యంలో ఒక క‌మిటీ వేసి తెలంగాణ‌కు పంపండి.. వాళ్ల‌కు వివ‌రాలు ఇస్తాం.. అవ‌స‌ర‌మైతే వారి విమాన ఖ‌ర్చులు మేమే భ‌రిస్తాం

  • మేం 50 రోజుల్లో రైతుల రుణ ఖాతాల్లో రూ.18 వేల కోట్లు వేసి రుణ మాఫీ చేశాం… ప్ర‌తి రైతు ఖాతా వివ‌రాలు అందిస్తాం
  • తెలంగాణ‌లో యువ‌త‌కు 50 వేల మందికి ప్ర‌భుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. ఎల్‌బీ న‌గ‌ర్ స్టేడియంలో స్వ‌యంగా నేను నియామ‌క ప‌త్రాలు అందించా
  • తెలంగాణ‌లో మ‌హిళ‌లు ఎక్క‌డి నుంచైనా ఎక్క‌డి వ‌ర‌కైనా ఉచితంగా ప్ర‌య‌ణించే అవ‌కాశం క‌ల్పించాం.. ఇప్ప‌టికే కోట్లాది మంది మ‌హిళ‌లు ఉచితంగా ప్ర‌యాణిస్తున్నారు.
  • 2004లో సోనియా గాంధీ సూచ‌న మేర‌కు దీపం ప‌థ‌కం కింద రూ.400 కే గ్యాస్ సిలిండ‌ర్..స్ట‌వ్ కేంద్ర ప్ర‌భుత్వం అంద‌జేసింది.
  • న‌రేంద్ర మోదీ ప్ర‌ధాన‌మంత్రి అయిన త‌ర్వాత రూ.400 గ్యాస్ సిలిండ‌ర్‌ను రూ.1200కు పెంచారు..
  • సిలిండ‌ర్ ధ‌ర పెంపు ద్వారా పేద మ‌హిళ‌లు రూపాయి రూపాయి వంటింట్లో దాచుకున్న డ‌బ్బును మోదీ చోరీ చేశారు

  • తెలంగాణ‌లో పేద మ‌హిళ‌ల‌కు రూ.500కే సిలిండ‌ర్ ఇస్తున్నాం… 50 ల‌క్ష‌ల కుటుంబాలు రూ.500కే సిలిండ‌ర్ ఇస్తున్నాం.. కావాలంటే ఆ వివ‌రాలు అందిస్తాం
  • రైతుల‌కు 24 గంట‌లు ఉచిత క‌రెంట్ స‌ర‌ఫ‌రా చేస్తున్నాం.. ప‌ట్ట‌ణాలు, ప‌ల్లెల్లో పేద‌ల‌కు 200 యూనిట్ల వ‌ర‌కు ఉచిత క‌రెంట్ ఇస్తున్నాం
  • స్వాతంత్య్రం వ‌చ్చిన త‌ర్వాత ఏ రాష్ట్రంలోనూ రానంత ధాన్యం దిగుబ‌డి తెలంగాణ‌లో ఈ సారి వ‌చ్చింది. మొత్తం 1.50 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల ధాన్యం పండింది.. ఎమ్మెస్పీకి అద‌నంగా రైతుల‌కు ప్ర‌తి క్వింటాకు మా ప్ర‌భుత్వం రూ.500 బోన‌స్ ఇస్తోంది.
  • పేద‌ల‌కు కార్పొరేట్ ఆసుప‌త్రుల్లో వైద్యం అందించేందుకు గానూ సోనియా గాంధీ నేతృత్వంలో దేశంలోనే మొద‌టి సారిగా రాజీవ్ ఆరోగ్య శ్రీ ప‌థ‌కాన్ని కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్రారంభించింది.. ఇప్పుడు దానిని తెలంగాణ‌లో మేం రూ.10 ల‌క్ష‌ల‌కు పెంచాం…పేద‌ల వైద్యానికి ఇప్ప‌టి వ‌ర‌కు రూ.50 వేల కోట్లు తెలంగాణ ప్ర‌భుత్వం ఖ‌ర్చు చేసింది.
  • మా గ్యారంటీలు క‌చ్చిత‌మైన గ్యారంటీలు.. మోదీ గ్యారంటీలు కాదు.. భార‌తీయ జుటా పార్టీ గ్యారంటీలు కాదు
  • తెలంగాణ ఇస్తాన‌ని సోనియా హామీ ఇచ్చారు..ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పార్టీ దెబ్బ‌తింట‌ద‌ని తెలిసినా ఇచ్చారు..

  • ఈ రోజుతో ఎన్నిక‌ల ప్ర‌చారం ముగుస్తున్నందున మోదీ.. బీజేపీ నాయ‌కులు రేపు హైద‌రాబాద్ వ‌స్తే స‌చివాల‌యంలో కూర్చోబెట్టి నేను చెప్పిన ప్ర‌తి అంశం వివ‌రాలు అందజేస్తా…అందులో ఏమైనా త‌ప్పు ఉంటే క్ష‌మాప‌ణ‌లు చెబుతా…
  • మోదీకి… ప‌ద‌కొండేళ్ల కాలంలో దేశంలోనూ, మ‌హారాష్ట్రలోనూ విజ‌య‌గాథ‌లు (స‌క్సెస్ స్టోరీలు) ఏం లేవు..
  • ముంబ‌యి దేశానికి ఆర్థిక రాజ‌ధాని… మ‌హారాష్ట్రలో రాజ‌కీయంగా దేశంలో రెండో పెద్ద రాష్ట్రం..అటువంటి రాష్ట్రాన్ని మోదీ కోవ‌ర్ట్ ఆప‌రేష‌న్లు.. విద్రోహుల అడ్డాగా మార్చారు…
  • చిన్న కార్య‌క‌ర్త శిందేను బాలాసాహెబ్ మంత్రి వ‌ర‌కు తీసుకువ‌స్తే ఆయ‌నను ఉద్ధవ్ ఠాక్రేకు వ్య‌తిరేకంగా మోదీకి గులాంగా మారారు.. . శ‌ర‌ద్ పవార్ సొంత బిడ్డ‌ను కాద‌ని సోద‌రుని కుమారుడు అజిత్ ప‌వార్‌ను మంత్రి ప‌ద‌వులు ఇస్తే ఆయ‌న‌ను మోదీకి గులాంగా మారారు.. అశోక్ చ‌వాన్‌ను కాంగ్రెస్ ముఖ్య‌మంత్రి చేస్తే ఆయ‌న మోదీకి గులాంగా మారారు…
  • ముంబ‌యిలోని ధారావిని క‌బ్జా చేసేందుకు విద్రోహులైన శిందే, అజిత్ ప‌వార్, అశోక్ చ‌వాన్‌ను వినియోగించుకుంటున్నారు.

  • 12 కోట్ల మ‌హారాష్ట్ర ప్ర‌జ‌లకు ఒక‌టి విజ్ఞ‌ప్తి చేస్తున్నా.. ఇది ఎన్నిక కాదు. ఇదో యుద్ధం.. గుజ‌రాత్‌కు చెందిన ఇద్ద‌రు మ‌హారాష్ట్రను దోచుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు..
  • మ‌హారాష్ట్ర ప్ర‌జ‌లు ఆలోచించి వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌హా వికాస్ అఘాడీకి (ఎంవీఏ) ఓటు వేయాలి…
  • మ‌హారాష్ట్రలో ఎంవీఏను గెలిపిస్తే తెలంగాణ‌లో అమ‌ల‌వుతున్న అన్ని హామీలు మ‌హారాష్ట్రలో అమ‌ల‌వుతాయి..
  • విలేక‌రుల ప్ర‌శ్న‌ల‌కు సీఎం రేవంత్ రెడ్డి జ‌వాబులు…
  • మైనారిటీ రిజ‌ర్వేష‌న్లు చ‌ట్ట‌ప‌రంగా చేయాల్సిన‌వి… తెలంగాణ‌లో మేం 4 శాతం అమ‌లు చేస్తున్నాం.. ఇక్క‌డ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత ఇక్క‌డ చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటారు…
  • మోదీకి కేంద్రంలో ప‌ద‌కొండేళ్ల‌లో విజ‌య గాధ లేదు.. గుజ‌రాత్‌లోనూ లేదు.. చ‌రిత్ర‌లో మ‌హారాష్ట్ర గురించి శివాజీ.. అంబేడ్క‌ర్ త‌దిత‌రుల గొప్ప‌తానాన్ని చ‌దువుకున్నారు.. ఇప్పుడు మీరు శిందే.. అజిత్ ప‌వార్ గురించి ఏం చెప్పాల‌నుకుంటున్నారు..?
  • కాంగ్రెస్ లో విభేదాలంటూ బీజేపీ వాట్సాప్ యూనివ‌ర్సిటీ త‌ప్పుడు ప్ర‌చారం చేస్తోంది.. తెలంగాణ‌లోనూ జూనియ‌ర్లు.. సీనియ‌ర్లు అని ప్ర‌చారం చేశారు…క‌ర్ణాట‌క‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోనూ అలానే ప్ర‌చారం చేశారు. చివ‌ర‌కు ఏమైంది..? సంక్షోభ స‌మ‌యంలోనే పార్టీలోనైనా… దేశంలోనైనా జెండా ప‌ట్టుకునేందుకు నూత‌న నాయ‌క‌త్వం బ‌య‌ట‌కు వ‌స్తుంది.. సంక్షోభం లేకుండా మీకు కొత్త నేత రారు.

  • మోదీ అంబానీ, అదానీ కోసం ప‌ని చేస్తారు.. ఇప్పుడు అంబానీ కూడా లేరు. అదానీ ఒక్క‌రి కోస‌మే ప‌ని చేస్తున్నారు.. అదానీకి మ‌హారాష్ట్రను పూర్తిగా దోచిపెట్టేందుకు వారు ప్ర‌య‌త్నిస్తున్నారు…
  • హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో 95 శాతానికిపైగా ప్ర‌జ‌లు హిందువులు.. వారు బీజేపీకి ఓటు వేయ‌లేదు.. కాంగ్రెస్‌కు వేశారు. మ‌హారాష్ట్రలోనూ కాంగ్రెస్‌ను ఆద‌రిస్తారు..
  • మోదీ ప్ర‌ధాన‌మంత్రి అయ్యాక కార్పొరేట్ కంపెనీల అప్పులు రూ.16 ల‌క్ష‌ల కోట్లు మాఫీ చేశారు.. అదే మేం రైతుల‌కు రుణ‌మాఫీ చేస్తే బీజేపీ నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు.. పేద మ‌హిళ‌ల‌కు సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తే ఎందుకు చేస్తార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. పేద మ‌హిళ‌ల‌కు అందించే సంక్షేమం, స‌హాయం తిరిగి మార్కెట్‌లోకి వ‌స్తుంది. అది ఖ‌ర్చు కాదు పెట్టుబ‌డి…
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News