Saturday, March 15, 2025
HomeతెలంగాణRevanth Reddy: వరదలు లేని నగరంగా హైదరాబాద్: రేవంత్ రెడ్డి

Revanth Reddy: వరదలు లేని నగరంగా హైదరాబాద్: రేవంత్ రెడ్డి

వరదలు లేని నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలనుకుంటున్నామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) తెలిపారు. హైటెక్‌ సిటీలోని సీఐఐ(CII) గ్రీన్‌ బిజినెస్‌ సెంటర్‌లో సీఐఐ జాతీయ కౌన్సిల్‌(CII National Council) సమావేశం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఫ్యూచర్‌ సిటీని నిర్మించాలని నిర్ణయించుకున్నామని పేర్కొన్నారు. ఇతర దేశాల్లోని నగరాలతో ఫ్యూచర్‌ సిటీ పోటీ పడుతుందని చెప్పారు. హైదరాబాద్‌ను కాలుష్య రహితంగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.పరిశ్రమల స్థాపనకు తెలంగాణ రాష్ట్రం సరైన ఎంపిక అన్నారు.

- Advertisement -

రాష్ట్రాన్ని రైజింగ్‌ తెలంగాణగా అభివృద్ధి చేయడమే తన కల అని స్పష్టం చేశారు. తెలంగాణ రైజింగ్ 2050లక్ష్యం దిశగా ముందడుగు వేస్తున్నామన్నారు. ఓఆర్ఆర్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ను అనుసంధానించే రేడియల్‌ రోడ్లు నిర్మించబోతున్నామని.. ఓఆర్‌ఆర్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ మధ్య ప్రాంతం తయారీ రంగానికి కేంద్రంగా ఉండబోతుందన్నారు. రాష్ట్రానికి తీరప్రాంతం లేదని.. అందుకే డ్రైపోర్టు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో కంపెనీలు కలిసి వస్తే అద్భుతాలు సృష్టించవచ్చని రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. అలాగే కాలుష్య నివారణకు 3,200వేల ఈవీ బస్సులు తెచ్చామని, ఈవీ వాహానాలకు రోడ్డు టాక్స్, రిజిస్ట్రేషన్ పన్నులను మినహాయించామన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News