హాత్ సే హాత్ జోడో యాత్ర లో భాగంగా మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట చక్కెర కర్మాగారం వద్ద టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి రైతులతో చర్చించారు. అనంతరం ఫ్యాక్టరీ ముందు మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రైతులంతా ఒక్కటి కావాలని, హర్యాన, పంజాబ్ రైతులను ఆదర్శంగా తీసుకోని ఉద్యమానికి సన్నద్ధం కావాలని, రైతులకు ఎల్లవేళలా అండగా ఉంటామని అన్నారు.
రైతులు సంఘాటీతంగా పోరాడి ప్రభుత్వాలను గద్దెను దించాలని రైతులను కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వస్తే వరంగల్ రైతు డిక్లరేషన్ ను అమలు చేస్తామని, 2లక్షల వరకు రుణమాఫీ చేస్తామని అన్నారు. అలాగే ఐదు వందలకే సిలిండర్ ను అందిస్తామని అన్నారు. ఛత్తిస్ ఘడ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న అన్ని పథకాలు అమలు చేస్తామని అన్నారు. రైతులు, ఈ ప్రాంతం ప్రజలు కాంగ్రెస్ ను ఆదరించాలని అన్నారు.