Ram Gopal Varma| ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)ను ప్రభుత్వం అరెస్ట్ చేయడంపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తనదైన శైలిలో స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం తీరుపై ఆయన మండిపడ్డారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
- Advertisement -
“తెలంగాణకు చెందిన బిగ్గెస్ట్ స్టార్ అల్లు అర్జున్ భారతీయ సినిమా చరిత్రలో అతిపెద్ద హిట్ కొట్టి రాష్ట్రానికి గొప్ప బహుమతి అందించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆయన్ను జైలుకు పంపి బన్నీకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది” అని ట్వీట్ చేశారు. కాగా అంతకుముందు బన్నీ అరెస్టుపై ప్రభుత్వానికి నాలుగు ప్రశ్నలు వేస్తూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.