Saturday, November 15, 2025
HomeతెలంగాణRTI act: ప్రజాస్వామ్యానికి నిజమైన అర్థాన్ని గుర్తించారు.. చరిత్రలో స్థిర స్థాయిగా నిలిచారు!

RTI act: ప్రజాస్వామ్యానికి నిజమైన అర్థాన్ని గుర్తించారు.. చరిత్రలో స్థిర స్థాయిగా నిలిచారు!

Right to Information Act: ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్వక్తులు ఎవరో మీకు తెలుసా.. తెలియదు కదూ..? అయినా అలాంటి ప్రశ్నఏంటీ.. వారేమైన బాలీవుడ్, టాలీవుడ్ హీరోలా ఏందీ గుర్తుపట్టడానికి.. అనే కదా మీ ప్రశ్న. అయితే మీరు ఈ మహోన్నత వ్యక్తుల గురించి తెలుసుకోవాల్సిందే!

- Advertisement -

సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రాన్నిపెట్టిన మహోన్నత వ్యక్తులు: ప్రశ్నిస్తే శత్రువు అవుతావేమో కానీ.. ప్రశ్నించకుండా ఉంటే జీవితాంతం బానిసగానే మిగిలిపోతావు అనే నానుడిని ఆ ముగ్గురు గుర్తించారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గుర్తింపు పొందిన భారత్‌లో జవాబుదారిపాలనకు మార్గాన్ని వేయాలనుకున్నారు. సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రాన్నిపెట్టాలని నిరంతరం కృషి చేశారు. చివరకు సాధించారు. సరిగ్గా 20 ఏళ్లక్రితం వీరు చేసిన పోరాట ఫలితమే సమాచార హక్కు చట్టం. ఈ చట్టం 20 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న క్రమంలో.. వారిగురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారతదేశంలో సమాచార హక్కు చట్టం కోసం జరిగిన ఉద్యమంలో అరుణా రాయ్, నిఖిల్ డే, శంకర్ సింగ్ వంటి వ్యక్తులు ప్రముఖపాత్ర పోషించారు.

ప్రజాస్వామ్యానికి నిజమైన అర్థం అదే: రహస్య చట్టాల ద్వారా చట్టబద్ధం చేయబడిన పాలనా వ్యవస్థలో.. జవాబుదారి తనాన్ని పొందే స్థితికి మన దేశం రావడానికి సరిగ్గా 58 సంవత్సరాలు పట్టింది. సమాచార హక్కు చట్టం 2005 అమలు భారత ప్రజాస్వామ్యంలో గణనీయమైన మార్పుకు నాంది పలికింది. ఎందుకంటే సమాచారానికి ఎంత ఎక్కువ ప్రాధాన్యత ఉంటే.. సమాజ అవసరాలకు ప్రభుత్వం యొక్క ప్రతిస్పందన అంత ఎక్కువగా ఉంటుంది. పౌరులకు సాధికారత కల్పించడం, ప్రభుత్వ పనితీరులో పారదర్శకతతో కూడిన జవాబుదారీతనాన్ని ప్రోత్సహించడం అనేవి ప్రజాస్వామ్యానికి నిజమైన అర్థం. సరిగ్గా ఈ అంశాన్నే1980 దశకంలో వీరు గుర్తించారు. భారత్ లాంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో జవాబుదారీతనాన్ని తీసుకురావడం కోసం అహర్నిశలు కృషి చేశారు. ఎలాగైనా మన దేశంలో జవాబుదారీతనాన్ని తీసుకురావాలని అనుకున్నారు. ఈ ముగ్గురూ కలసి రాజస్థాన్ లోని దేవదుంగ్రి గ్రామంలో 1987 మేడే రోజు మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ అనే సంస్థ ప్రారంభించి సమాచార హక్కు చట్టం కోసం ఉద్యమాన్ని చేపట్టారు. చివరికి 2005లో వారు అనుకున్నది సాధించారు.

పేదల తరుపున గొంతుకై నిలిచిన అరుణారాయ్: మాజీ ఐఏఎస్ అధికారిణి శ్రీమతి అరుణారాయ్.. తను ఉద్యోగ నిర్వహణలో నిరంతరం పేదల సంక్షేమం కోసం కృషిచేశారు. అణగారిన వర్గాలకు దక్కాల్సిన పథకాలు వారికి దక్కటల్లేదనే ఉద్ధేశ్యంతో తన ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. అనంతరం పేదల తరుపున గొంతుకై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ.. నిరింతరం పేదల తరపున పోరాటం చేస్తున్నారు.

మౌలిక స్వరూపంలో దాగున్న రహస్యం: అలాగే ఫోటోలో ఎడమవైపు ఉన్న వ్యక్తి శంకర్ సింగ్. వీరు సామాజిక కార్యకర్త. కుడివైపు ఉన్న వ్యక్తి నిఖిల్ డే. వీరిద్దరు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లి ఉన్నత స్థితిలో స్థిరపడ్డారు. కానీ వీరిలో ఏదో వెలితి. తాము పుట్టిపెరిగిన దేశం కోసమే వారి నిరంతర ఆలోచనలు. స్వదేశంలో జరుగుచున్న అన్యాయాలపై నిరంతరం వారు పరిశోధనలు చేస్తుండేవారు. ఏం చేస్తే సామాన్య ప్రజలకు సత్వర న్యాయం చేకూరుతుందని తమను తాము ప్రశ్నించుకునేవారు. రాజ్యంగ పరిధిలోనే పరిష్కారాన్ని గుర్తించాలనుకున్నారు. రాజ్యంగ మౌలిక స్వరూపంలో తమ ప్రశ్నకు సమాధానం దాగుందని గుర్తించారు. వెంటనే మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ అనే సంస్థ ప్రారంభించి జవాబుదారీతనం కోసం ఉద్యమాన్ని చేపట్టారు. వీరి పోరాట ఫలితమే సమాచార హక్కు చట్టం-2005. సరిగ్గా నిన్నటికి ఈ చట్టానికి ఇరవై సంవత్సరాలు పూర్తి అయ్యాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad