ప్రజా యుద్ధనౌకగా ప్రసిద్ధిగాంచిన, ప్రజాగళంగా మన్ననలు పొందిన గద్దర్ కన్నుమూశారు. గత కొంతకాలంగా హృద్రోగ సమస్యలతో బాధపడుతున్న 77 ఏళ్ల గద్దర్ అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మృతిచెందారు. గుమ్మడి విఠల్ రావ్ అసలు పేరైనా గద్దర్ గా ప్రజానాట్య మండలి కళాకారుడిగా ఈయన ప్రఖ్యాతిగాంచాడు నక్సల్స్ సానుభూతిపరుడిగా, ఉద్యమ గీతాలు ఆలపించే గద్దర్ ఇంజినీరింగ్ డ్రాపౌట్ కూడా. ఎన్నో సినిమాల్లో కూడా నటించి, పాటలు పాడిన గద్దర్ ప్రోగ్రాం ఉందంటే ప్రజలంతా ఉత్సాహంగా తరలివచ్చేవారు. జానపద కళాకారుడిగా ఎన్నో సత్కారాలు, సన్మానాలు అందుకున్నారు గద్దర్.
- Advertisement -
ప్రజా కవి గద్దర్ మరణంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
ప్రజా కవి - గాయకుడు, బడుగు, బలహీనవర్గాల విప్లవ స్ఫూర్తి గద్దర్ గారు. గద్దర్ పాట ఎప్పుడూ సామాజిక సంస్కరణల పాటే. ఆయన నిరంతరం సామాజిక న్యాయం కోసమే బతికారు. ఆయన మరణం ఊహించనిది.
సామాజిక న్యాయ ప్రవక్తల భావాలు, మాటలు, వారి జీవితాలు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూ జీవించే ఉంటాయి. గద్దర్ గారికి మొత్తంగా తెలుగు జాతి సెల్యూట్ చేస్తోంది. ఆయన కుటుంబ సభ్యులకు ఈ కష్ట సమయంలో మనమంతా బాసటగా ఉందాంమంటూ జగన్ నివాళి అర్పించారు.