Rohit Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫైలట్ రోహిత్ రెడ్డి చేసిన విజ్ఞప్తిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తిరస్కరించింది. మధ్యాహ్నాం మూడు గంటలకు విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. వాస్తవానికి ఈ రోజు ఉదయం పదిన్నర గంటలకు ఎమ్మెల్యే రోహిత్ రోడ్డి విచారణకు హాజరు కావాల్సి ఉంది.
అయితే.. ఈ ఉదయం రోహిత్ రెడ్డి ఈడీ అధికారులకు లేఖ రాశారు. తాను ఈరోజు విచారణకు హాజరు కాలేనని తెలిపారు. నోటీసుల్లో అడిగిన వివరాల సేకరణకు మరికొంత సమయం పడుతుందని అందులో పేర్కొన్నారు. మరో వారం గడువు ఇవ్వాలని పీఏ శ్రవణ్ ద్వారా ఈడీ కార్యాలయానికి లేఖ పంపించారు. అయితే.. గడువు ఇచ్చేందుకు ఈడీ అధికారులు నిరాకరించారు. దీంతో ఈడీ ఎదుట రోహిత్ రెడ్డి హాజరు అవుతారా..? లేదా అన్నది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాఫిక్‌గా మారింది.
హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలంటూ శుక్రవారం ఈడీ అధికారులు రోహిత్‌రెడ్డికి సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ నోటీసుల్లో ఆధార్, పాన్‌కార్డుతో తన కుటుంబానికి చెందిన ఆస్తులు, బ్యాంకు ఖతాలు, కంపెనీ వివరాలు తీసుకురావాలని కోరింది. ఆదాయపన్ను చెల్లింపులతో పాటు ఇతర క్రయ విక్రయాలకు సంబంధించి గత ఏడేళ్ల సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు.