రవాణా శాఖలో టీఎస్ బదులు టీజీ మార్పు అంశంపై చేసిన ఖర్చును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్రంగా తప్పుబట్టారు. నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
“రైతు భరోసా ఇచ్చింది లేదు.. రుణమాఫీ సక్కగా చేసింది లేదు.. పెన్షన్ పెంచింది లేదు. ఆరు గ్యారెంటీల అమలుకు దిక్కులేదు. కానీ.. ఆగమేఘాల మీద అనవసరమైన వాటి కోసం వేల కోట్ల ఖర్చు పెట్టేందుకు మనసొచ్చిందా? నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లు అక్షరం మార్పు కోసం అక్షరాల రూ.1000 కోట్ల ఖర్చా..? వెయ్యి కోట్లు కాదు లక్ష కోట్లు ఖర్చుపెట్టినా..తెలంగాణ అస్థిత్వాన్ని చెరపలేవు. నాలుగు కోట్ల గుండెలపై కెసిఆర్ చేసిన సంతకాన్ని మార్చలేవు.” అని కేటీఆర్ పేర్కొన్నారు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాహనాల నెంబర్ ప్లేట్లతో పాటు లైసెన్స్‌ల జారీ మీద పేరును టీఎస్ బదులు టీజీగా మార్చిన సంగతి తెలిసిందే.