Saturday, November 15, 2025
HomeతెలంగాణHyderabad Murder: రూ.400 గొడవ.. స్నేహితుడిని లారీ కిందకి తోసి హత్య..!

Hyderabad Murder: రూ.400 గొడవ.. స్నేహితుడిని లారీ కిందకి తోసి హత్య..!

- Advertisement -

Hyderabad Murder: మనుషుల్లో మానవత్వం మాయమై.. మనిషి మృగంలా మారిపోతున్నాడు. దానికి ఉదాహరణగా మనం ఎన్నో సంఘటలు చూశాం. అలాంటిదే ఇప్పుడు హైదరాబాద్ నగరంలో మరో ఘటన చోటుచేసుకుంది. స్నేహితుడు అని కూడా చూడకుండా కేవలం రూ.400 గొడవలో అతన్ని లారీ కిందకి తోసి చంపేశాడో ఓ వ్యక్తి. ముందు స్నేహితుడిని కర్రతో చితక్కొట్టి అప్పటికి అతని కోపం చల్లారక అటుగా వస్తున్న లారీ కిందకి తోసేయడంతో స్నేహితుడు అక్కడిక్కడే మరణించాడు.

హైదరాబాద్ నగరంలోని బాలానగర్ లో పట్టపగలే జరిగిన ఈ దారుణ హత్యతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. కాశీరాం, శ్రీనివాస్ అనే ఇద్దరూ కూలీలుగా పని చేస్తుండగా ఇద్దరూ స్నేహితులు కూడా. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య రూ.400 కోసం గొడవ జరిగింది. ఆ డబ్బు కోసం జరిగిన వివాదం కాస్త చిలికి చిలికి గాలి వానగా మారి చివరికి హత్యకి దారితీసింది. ముందుగా నర్సాపూర్ చౌరస్తా వద్ద కర్రతో శ్రీనివాస్ పై కాశీరాం విచక్షణారహితంగా దాడి చేశాడు.

కర్రతో శ్రీనివాస్ ను చితక్కొట్టినా అప్పటికి కోపం చల్లారకపోవడంతో అటుగా వస్తున్న లారీ కిందకు తోసేశాడు కాశీరాం. దీనితో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. ఈ హత్యకు సంబంధించి అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అందరూ చూస్తుండగానే పట్టపగలే జరిగిన ఈ హత్య అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad