RS Brothers Warangal showroom Launching : వరంగల్‌లో ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ ఆర్.ఎస్.బ్రదర్స్ మరో కొత్త షోరూంను ప్రారంభించింది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంకు ప్రముఖ సినీ నటి శ్రీలీల హాజరయ్యారు.

సంప్రదాయాన్ని ఆధునిక ఫ్యాషన్‌తో మేళవించి, కొనుగోలుదారుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న ఆర్.ఎస్.బ్రదర్స్, వరంగల్ లో కొత్త షోరూమ్ ను ప్రారంభించింది. ఆ నగర వాసుల అభిరుచులకు తగిన వస్త్ర వైవిధ్యంతో కొత్త డిజైన్స్ తీసుకువచ్చేసింది. ఇక ఈ ప్రత్యేక కార్యక్రమానికి ప్రముఖ తెలుగు సినీతార శ్రీలీల ముఖ్య అతిథిగా విచ్చేసి, జ్యోతిని వెలిగించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఆర్. ఎస్ బ్రదర్స్ సంస్థకు మూలస్తంభాలైన పి.వెంకటేశ్వర్లు, ఎస్.రాజమౌళి, టి.ప్రసాదరావు, దివంగత పి.సత్యనారాయణల సుదూర దృష్టితో 1990ల నుంచి ప్రారంభమైన ఈ సంస్థ, ఇప్పుడు దేశ వ్యాప్తంగా 100కి పైగా షోరూమ్‌లతో సరికొత్త మైలురాయిని చేరింది. ఇక తాజాగా ప్రారంభమైన వరంగల్ షోరూమ్, కుటుంబ సభ్యులందరి అభిరుచులకు తగిన వస్త్రాలను ఒకే చోట అందించడంలో ప్రత్యేకతను సంతరించుకుంది.
రూ.149 ప్రారంభ ధరతో అందుబాటులో ఉన్న వుమెన్స్ వేర్‌లో కంచిపట్టు చీరలు, డిజైనర్ లెహెంగాలు, ఫెస్టివల్ కుర్తాలు, వెస్ట్రన్ వేర్ వంటివి కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నాయి. మెన్స్ వేర్‌లో ట్రెండీ షర్టులు, కర్తాలు, ఫార్మల్ వేర్, కిడ్స్ కలెక్షన్‌లో క్యూట్ డ్రెస్‌లు, ప్లే వేర్‌లు వైవిధ్యంగా ఉన్నాయి. పెళ్లి, పండగలు, శుభకార్యాలకు సంబంధించిన వెడ్డింగ్ కలెక్షన్స్ సంస్థ ప్రత్యేకతగా నిలుస్తున్నాయి.

షోరూం ప్రారంభం సందర్భంగా శ్రీలీల, ఈ షోరూమ్‌ను సందర్శించి, వరంగల్‌లోని షాపింగ్ ప్రియులకు ఇది అందమైన, ఆకర్షణీయ గమ్యంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. “ఆర్.ఎస్.బ్రదర్స్ బ్రాండ్ నాణ్యత, వైవిధ్యంతో ప్రతి తరానికి తగిన ఎంపికలు అందిస్తుంది. వరంగల్ వాసులకు ఇది గొప్ప బహుమతి” అని తెలిపారు. సంస్థ డైరెక్టర్లు వినియోగదారుల అభిరుచుల వైవిధ్యానికి తగినట్లుగా బ్రాండ్‌ను మరింత విస్తరిస్తామని తెలిపారు. మారుతున్న ట్రెండ్‌లకు అనుగుణంగా నాణ్యత, సరసమైన ధరలతో కొత్త కలెక్షన్‌లు ఏర్పాటు చేస్తామని, ఇతర ప్రాంతాల్లో కొత్త షోరూమ్‌లు నెలకొల్పుతామని తెలిపారు.

సంస్థ చైర్‌పర్సన్, హోల్ టైమ్ డైరెక్టర్ పొట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, “వరంగల్ షోరూమ్‌లో వెడ్డింగ్ కలెక్షన్స్, పెళ్లి కుమార్తె సంప్రదాయ వస్త్రాల సాధికారిక పనితనంతో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. కుటుంబాలకు ఇది పర్ఫెక్ట్ డెస్టినేషన్” అని వివరించారు. మేనేజింగ్ డైరెక్టర్ సీర్ణ రాజమౌళి, “భారతదేశ వ్యాప్తంగా కొనుగోలుదారుల అభిరుచులు, తాజా ఫ్యాషన్‌లను ప్రతిబింబించే వస్త్రశ్రేణి మా షోరూమ్‌లో లభిస్తుంది. వరంగల్‌కు మా స్వాగతం” అని అన్నారు. హోల్ టైమ్ డైరెక్టర్ తిరువీధుల ప్రసాదరావు, “వరంగల్ వాసులకు హృదయపూర్వక స్వాగతం. వైవిధ్యభరిత వస్త్రాలు, ఆకర్షణీయ ఫ్యాషన్‌లు, అందుబాటు ధరల్లో ఒకే చోట లభిస్తాయి. పండగలు, వివాహాలకు విచ్చేయండి” అని కోరారు.


