Monday, December 9, 2024
HomeతెలంగాణRTC Driver: ఆభరణాలు దొంగలించిన ఆర్టీసీ బస్సు డ్రైవర్

RTC Driver: ఆభరణాలు దొంగలించిన ఆర్టీసీ బస్సు డ్రైవర్

RTC Driver| ఆర్టీసీ బస్సులో ప్రయాణికుల ఆభరణాలు డ్రైవర్ దొంగలించిన ఘటన చర్చనీయాంశంగా మారింది. అసలు ఏం జరిగిందంటే.. వరంగల్ నుంచి ఓ మహిళ నిజామాబాద్‌కు ఆర్టీసీ బస్సులో వెళ్తోంది. అయితే తన బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగ్‌ను ఆ మహిళ డ్రైవర్ సీటు వెనకాల పెట్టింది. ఆ బ్యాగ్‌పై కన్నేసిన బస్సు డ్రైవర్ బంగారు ఆభరణాలను దొంగలించాడు. అయితే డ్రైవర్ ఆభరణాలను దొంగలించడాన్ని ఓ ప్రయాణికుడు ఫోన్‌లో రికార్డ్ చేశాడు. దీంతో ఆగ్రహించిన తోటి ప్రయాణికులు డ్రైవర్‌ను ప్రశ్నించగా.. తొలుత తాను దొంగతనం చేయలేదంటూ బుకాయించాడు. తర్వాత వీడియో చూపించడంతో తానే ఆభరణాలు దొంగలించానని ఒప్పుకున్నాడు. దీంతో సదరు డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

కాగా సాధారణంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు మరిచిపోయిన లగేజీ బ్యాగులను కొంతమంది బస్సు డ్రైవర్లు, కండక్టర్లు నిజాయితీగా పోలీసులకు అప్పగిస్తూ ఉంటారు. కానీ ప్రయాణికుల లగేజీకి భద్రత కల్పించాల్సిన డ్రైవరే ఇలాంటి ఘటనకు పాల్పడటంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ డ్రైవర్‌పై పోలీసు కేసు నమోదుచేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News