RTC special buses for Koti Deepotsavam : కార్తీక మాసం వచ్చిందంటే చాలు.. కోటి దీపోత్సవం గురించి భక్తులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటారు. ఇల కైలాసంలో ప్రతీ రోజు ఒక్కో ప్రత్యేకత.. ఒక్కో కల్యాణం.. లింగోద్భవం.. ఆహా..అలా చెప్పుతుంటేనే రోమాలు నిక్కపొడుస్తున్నాయి. ఇక ఎన్టీఆర్ స్టేడియానికి వెళ్లి ఆ శివుడిని ప్రార్థిస్తే కలిగే అనుభూతి వేరే లెవల్. భక్తులచే స్వయంగా అభిషేకాలు, అర్చనలు, ప్రముఖుల ఉపన్యాసానాలు, ప్రవచనాలు ఇలా ఆద్యంతం.. కోటి దీపాల పండుగ కట్టి పడేస్తోంది. ఇంతటి ప్రత్యేకత ఉన్న కోటి దీపోత్సవం నేటి నుంచి ఈనెల 13వ తేదీ వరకు ఘనంగా కొనసాగనుంది. అయితే భక్తుల సౌకర్యార్థం కోటి దీపోత్సవానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపనున్నట్టుగా పేర్కొంది.
రండి తరలిరండి: ప్రతీ ఏటా కోటిదీపోత్సవానికి హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాల నుంచి సైతం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. సాయంత్రం నుంచి రాత్రి వరకు కోటి దీపాల వెలుగులు, శివనామస్మరణతో ఎన్టీఆర్ స్టేడియం పరిసరాలు మారుమోగుతాయి. ఇక, కోటి దీపోత్సవం నేపథ్యంలో.. నేటి నుంచి ఈ నెల 13వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు ఆర్టీసీ పేర్కొంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, జూబ్లీ బస్టాండ్ నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేసినట్టుగా ఆర్టీసీ అధికారులు తెలిపారు. అయితే దేశం నలుమూలల నుంచి వేద పండితులు, పీఠాధిపతులు, ఈ మహా ఆధ్యాత్మిక యజ్ఞంలో పాల్గొననున్నారు.
Also read:https://teluguprabha.net/devotional-news/rasi-phalalu-nov-1-2025-check-your-horoscope/


