తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఆర్టీసీ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా, పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం సమ్మెకు సిద్ధమవుతున్నాయి కార్మిక సంఘాలు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి 14 నెలలైన ఉద్యోగుల సమస్యల్ని పాటించుకోవడం లేదని ఈ నెల 27 న సమ్మె నోటీసు ఇచ్చేందుకు కార్మిక జే ఏ సి సిద్ధమైంది. ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో డిపోలను ప్రభుత్వం ప్రైవేటు సంస్థల చేతుల్లో పెడుతుందంటున్న జే ఏ సి నేతలు ఆరోపిస్తున్నారు. ప్రైవేటు కంపెనీల ద్వారా ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావడం వల్ల ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదముందని ఆర్టీసీ జే ఏ సీ చెబుతోంది. ప్రభుత్వంలో విలీనం, 2021 పీఆర్సీ, పెండింగ్ బకాయిల సమస్యలు పరిష్కారం కాలేవంటున్న జే ఏ సి నేతలు తమ డిమాండ్లపై సమ్మె బాట పట్టనున్నారు.