Saturday, November 15, 2025
HomeతెలంగాణNo negetive mind for rulers: పాలకులు నెగిటివ్ మైండ్ సెట్‌తో ఉండొద్దు

No negetive mind for rulers: పాలకులు నెగిటివ్ మైండ్ సెట్‌తో ఉండొద్దు

Harishrao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్‌తో ఉంటే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించారు. శుక్రవారం లండన్‌లోని ఎన్నారైలు నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ పార్టీ మొదట పుట్టింది లండన్‌లోనేనని, యూకే ఎన్నారైల వల్లే ప్రపంచవ్యాప్తంగా టీఆర్ఎస్ విస్తరించిందన్నారు. ఎన్నారై సెల్ చైర్మన్ అనిల్ కుర్మాచలం లేని లోటు కనిపిస్తుందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అనేక అద్భుతాలు సాధించిందన్నారు. తమ హయాంలో తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలో అగ్రగామిగా ఉండేదన్నారు. జీఎస్డీపీ గ్రోత్‌లో రాష్ట్రానికి దరిదాపులో కూడా ఏ రాష్ట్రం ఉండేది కాదన్నారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందించామన్నారు. తాము చేపట్టిన అన్ని పథకాలను దేశం అనుసరించింది’ అని చెప్పారు. ‘కాళేశ్వరం అంటే రూ.లక్ష కోట్లు పోయాయని దుష్ప్రచారం చేస్తున్నారు. గతేడాది, ఈ సంవత్సరం మంచి వర్షపాతం ఉండె.

- Advertisement -

ఎస్సారెస్పీ నుంచి మిడ్ మానేరుకు నీళ్లు వస్తాయి. కాళేశ్వరం మోటర్లను మిడ్ మానేరు నుంచి ఆపరేట్ చేస్తాం. 37 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు వస్తాయి. సాధారణ వర్షపాతం ఉన్న సంవత్సరంలో ఎల్లంపల్లి నుంచి కాళేశ్వరం మోటర్లు ఆన్ చేసుకుంటే అక్కడినుంచి నీళ్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కడ వర్షపాతం లేకున్నా మేడిగడ్డ వద్ద నీళ్లు ఉంటాయి. ఎంత క్రైసిస్ వచ్చినా అక్కడ నీళ్లు ఉంటాయి. 37 లక్షల ఎకరాలకు సాగునీరు, 60 శాతం తెలంగాణకు తాగునీరు పరిశ్రమలకు 60 టీఎంసీలు ఇవ్వొచ్చు. కాళేశ్వరంలో 141 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంది. మల్లన్న సాగర్ నుంచి మూసీకి నీళ్లు తీసుకెళ్తానని రేవంత్ రెడ్డి అన్నాడు. రూ.7 వేల కోట్లతో టెండర్లు కూడా పిలిచారు. కాళేశ్వరం కూలిపోతే మల్లన్న సాగర్ నుంచి నీళ్లను మూసీకి ఎలా తీసుకెళ్తావు రేవంత్ రెడ్డి? గంధమల్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశావు. దానికి ఆధారం కాళేశ్వరం, మల్లన్న సాగరే కదా. కాళేశ్వరం లేకున్నా రికార్డ్ పంట పండిందని ఉత్తంకుమార్ రెడ్డి అంటున్నారు.

మీ ప్రభుత్వం వచ్చాక ఒక చెరువు దగ్గర ఒక చెక్ డ్యాం కట్టారా?, ఒక ప్రాజెక్టు కట్టారా?, ఒక ఎకరానికి అయినా నీల్లు ఇచ్చారా అని ఆయనను అడిగా. మరి ఇంత పంట ఎలా సాధ్యమైందని ప్రశ్నించా. పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి వల్ల ఇంత పంట పండింది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రభావం ఉంది. కేవలం మూడు బ్యారేజీల్లో.. ఒక్క బ్యారేజీలో మాత్రమే మూడు పిల్లర్లు కుంగాయి. అసెంబ్లీలో ఎమ్మెల్సీ కోదండరాం.. అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టు గురించి ప్రశ్న అడిగితే.. అవి బాగానే ఉన్నాయని, ఎలాంటి ఇబ్బంది లేదని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి జవాబు ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వమే కట్టి, ఆ పార్టీ హయాంలోనే కూలిన కడెం, ఎల్లంపల్లి, పెద్దవాగు ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటి?. మూడు నాలుగు వందల కోట్లలో మేడిగడ్డ రిపేర్ అయిపోతుంది. కానీ కాగ్రెస్‌ మాత్రం లక్ష కోట్లు అని దుష్ప్రచారం చేస్తున్నది. రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల ప్రయోజనాలు దెబ్బ తినే విధంగా రాజకీయాలు చేయకూడదు’ అని హరీశ్‌‌రావు సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad