Sunday, July 7, 2024
HomeతెలంగాణSabitha Indra Reddy: 'మన ఊరు మన బడి' పనులకు శంకుస్థాపన

Sabitha Indra Reddy: ‘మన ఊరు మన బడి’ పనులకు శంకుస్థాపన

ఇదో యజ్ఞంలా చేస్తున్న సీఎం కేసీఆర్

రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని రాజేంద్రనగర్ డివిజన్లోని.. శివరాంపల్లి ప్రభుత్వ పాఠశాలలో మన ఊరు – మన బడి, మన బస్తీ మన బడి కార్యక్రమంలో 2.57 కోట్లు మంజూరైన మౌలిక వసతులు, అదనపు తరగతి గదుల పనులను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తో కలసి శంకుస్థాపన చేశారు.

- Advertisement -

స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కార్యక్రమాలలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మాట్లాడుతూ… ఒక యజ్ఞంలాగా ముఖ్యమంత్రి కేసీఆర్ మన ఊరు- మన బడి,మన బస్తీ-మన బడి కి శ్రీకారం చుట్టారని కొనియాడారు. చాలా వరకు ప్రయివేటు పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ఉండటంతో తల్లిదండ్రులు మొగ్గు చూపుతుండటంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలల్లో ఈ సంవత్సరం నుండి ఆంగ్ల బోధనకు ఆదేశాలు ఇచ్చారనీ తెలిపారు. మన విద్యార్థులు ప్రపంచముతో పోటీ పడేలా తెలంగాణ విద్యార్థి ఎక్కడకు వెళ్లిన రాణించేలా తయారు కావాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ అభిమతమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ అనిత రెడ్డి , ట్రస్విడీసీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, కార్పొరేటర్ అర్చన జయప్రకాష్ , విద్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వాకాటి కరుణ , డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ శ్రీమతి దేవసేన, ఎంఈఓ రామ్ రెడ్డి, పార్టీ డివిజన్ అధ్యక్షుడు ధర్మారెడ్డి, పార్టీ సీనియర్ నాయకుల సుభాష్ రెడ్డి, ధర్మపాల్ రెడ్డి, నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News