Sachin Sawant: తెలంగాణ వ్యవహారాల ఏఐసీసీ కార్యదర్శిగా మహారాష్ట్రకు చెందిన సచిన్‌సావంత్‌ను కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది. ఈ మేరకు మంగళవారం రాత్రి పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం తెలంగాణ ఇన్‌చార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్‌కు సహాయకుడిగా సచిన్ పనిచేయనున్నారు. మొత్తం 9 రాష్ట్రాలకు ఏఐసీసీ కార్యదర్శులను నియమించగా అందులో తెలంగాణ బాధ్యతలను సచిన్‌సావంత్‌కు అప్పగిస్తూ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణతో పాటుగా హిమాచల్ప్రదేశ్, హర్యానా, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, జార్ఖండ్, మణిపూర్, బిహార్, పంజాబ్, జమ్ము కశ్మీర్ రాష్ట్రాలకు సైతం ఏఐసీసీ కార్యదర్శులను నియమించింది.
జెట్టి కుసుమకుమార్‌కు ఒడిశా బాధ్యతలు: తెలంగాణ కాంగ్రెస్ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్‌ను ఒడిశా కాంగ్రెస్ వ్యవహారాల కార్యదర్శిగా నియమిస్తూ.. పార్టీ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. గుంటూరుకు చెందిన ఉషానాయుడికి మధ్యప్రదేశ్ బాధ్యతలు అప్పజెప్పారు. ఇకనుంచి వీరు ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జిలతో కలిసి పనిచేస్తారు.



