Saturday, November 23, 2024
HomeతెలంగాణSaidireddy: ప్రభుత్వం సాగు నీరు, ఉచిత విద్యుత్‌ అందిస్తుంది

Saidireddy: ప్రభుత్వం సాగు నీరు, ఉచిత విద్యుత్‌ అందిస్తుంది

రైతు రాజ్యాన్ని కొనసాగిద్దాం

తెలంగాణ రైతంగానికి టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని హుజూర్నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. పాలకవీడు, నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి, క్లస్టర్ రైతు వేదికల, రైతు సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయానికి మూడు గంటలు కరెంటు ఇస్తే సరిపోతుందని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు వెంటనే తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలన్నారు.

- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రభుత్వం సాగు నీరు, నాణ్యమైన ఉచిత విద్యుత్‌ అందిస్తుందని చెప్పారు. రైతులకు 3 గంటల కరెంట్ చాలంటున్న కాంగ్రెస్ పార్టీని బొందపెడదామని, కేసీఆర్ రైతు రాజ్యాన్ని కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. రైతులతో పెట్టుకున్న వాళ్లకు డిపాజిట్లు కూడా దక్కలేదని, రైతులే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తారని అన్నారు. రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అనంతరం నేరేడుచర్ల మండలం, దిర్శించర్ల గ్రామానికి చెందిన యాతవాకిల్ల లచ్చయ్య ప్రమాదవశాత్తు మరణించగా, ఆయన కుటుంబానికి రెండు లక్షల ప్రమాద బీమా చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, రైతులు, మహిళాలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News