Thursday, September 19, 2024
HomeతెలంగాణSaidireddy: విఘ్నేశ్వరుడి పూజలో ఎమ్మెల్యే శానంపూడి

Saidireddy: విఘ్నేశ్వరుడి పూజలో ఎమ్మెల్యే శానంపూడి

నేరేడుచర్లలో అన్నదాన కార్యక్రమాలు

నేరేడుచర్ల పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఐదవ రోజు కొనసాగుతున్నాయి. పలుచోట్ల ప్రతిష్టించిన వినాయక విగ్రహాల వద్ద ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డికి పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు అందించారు, అనంతరం జాన్ పహాడ్ రోడ్ లోని ఫర్టిలైజర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో,14వ వార్డులోని మహేంద్ర షోరూం సమీపంలో, రామాపురం రోడ్ నందు పలు విగ్రహాల వద్ద ఏర్పాట్లు చేసిన అన్నదాన వితరణ కార్యక్రమాలలో ఎమ్మెల్యే సైదిరెడ్డి పాల్గొని భక్తులకి వడ్డించారు.

- Advertisement -

14 వ వార్డులో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ సరికొప్పుల నాగేశ్వరరావు,టిడిపి నాయకులు పాల్వాయి రమేష్, రామాపురంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నూకల సందీప్ రెడ్డి అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమాలలో మున్సిపల్ చైర్మన్ చందమల్ల జయ బాబు, మార్కెట్ చైర్మన్ నాగండ్ల శ్రీధర్ బాబు,డిసిసిబి డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు అరిబండి సురేష్ బాబు, బీఆర్ఎస్ పట్టణ ఎన్నికల ఇన్చార్జి కొనతం సత్యనారాయణ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు వల్లంశెట్ల రమేష్ బాబు ఆకారపు వెంకటేశ్వర్లు, సైదులు, సుందరయ్య తదితర పార్టీ నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News