Saturday, November 15, 2025
HomeతెలంగాణSamakka Sagar Project: సమ్మక్క సాగర్‌ ప్రాజెక్టుకు లైన్ క్లియర్: ఛత్తీస్‌గఢ్ ఎన్ఓసీకి సూత్రప్రాయంగా అంగీకారం

Samakka Sagar Project: సమ్మక్క సాగర్‌ ప్రాజెక్టుకు లైన్ క్లియర్: ఛత్తీస్‌గఢ్ ఎన్ఓసీకి సూత్రప్రాయంగా అంగీకారం

Samakka Sagar Project: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమ్మక్క సాగర్‌ ప్రాజెక్టుకు మరో అడుగు ముందుకు పడింది. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిరభ్యంతర పత్రం (NOC) జారీ చేసేందుకు ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఈ మేరకు తెలంగాణ ఇరిగేషన్, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌ సాయ్‌తో సోమవారం భేటీ అయ్యారు.

- Advertisement -

ఈ భేటీలో ఉత్తమ్ మాట్లాడుతూ, గోదావరిపై నిర్మిస్తున్న సమ్మక్క సాగర్ ప్రాజెక్టు వల్ల ఛత్తీస్‌గఢ్‌లో కొంత భూభాగం ముంపునకు గురవుతుందని వివరించారు. ముంపునకు గురయ్యే ప్రాంతానికి తగిన పరిహారం, సహాయ పునరావాస చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ హామీలతో సంతృప్తి చెందిన ఛత్తీస్‌గఢ్‌ సీఎం విష్ణుదేవ్‌ సాయ్‌, ఈ ప్రాజెక్టుకు NOC జారీ చేసేందుకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. దీంతో ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం తరపున ఛత్తీస్‌గఢ్‌ సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.

ప్రాజెక్టు విశేషాలు
సమ్మక్క సాగర్‌ ప్రాజెక్టు తెలంగాణలో నీటి లభ్యతను పెంచేందుకు గోదావరిపై 6.7 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించబడుతోంది. ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో, మహదేవ్‌పూర్ మండలం కన్నాయిగూడెం గ్రామం వద్ద నిర్మిస్తున్న ఈ బ్యారేజీ వల్ల గోదావరి పరీవాహక ప్రాంతంలోని వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఈ ప్రాజెక్టు వెనుక జలాల వల్ల ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో కొంత భూభాగం ముంపునకు గురవుతోంది. ఈ విషయంపై రెండు రాష్ట్రాల మధ్య గత కొంతకాలంగా ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతున్నాయి. చివరికి, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు ఛత్తీస్‌గఢ్ NOC ఇవ్వడానికి అంగీకరించింది. ఈ పరిణామం ప్రాజెక్టు నిర్మాణ పనులను వేగవంతం చేయడంలో కీలకం కానుంది. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఈ అవగాహన భవిష్యత్తులోనూ ఇటువంటి ప్రాజెక్టుల నిర్మాణానికి మార్గదర్శకంగా నిలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad