Sunday, October 6, 2024
HomeతెలంగాణSambhani: BRS శ్రేణుల్లో ఉత్సాహం నింపిన సంభాని

Sambhani: BRS శ్రేణుల్లో ఉత్సాహం నింపిన సంభాని

సండ్ర, సంబానికి డప్పు మేళాలతో, పూల వర్షంతో ఘన స్వాగతం

కల్లూరు మండల పరిధిలోని, యర్రబోయినపల్లి, చండ్రుపట్ల, పేరువంచ, కొర్లగూడెం, నారాయణపురం, ముగ్గువెంకటాపురం, రఘునాద్ బంజర తదితర గ్రామాలలో సత్తుపల్లి ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య, ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన విసృత ప్రచారం కొనసాగింది. ప్రతీ గ్రామంలోను ఓటర్లు ఆయనకు ఘన స్వాగతం పలుకుతూ, బ్యాండ్ మేళాలు, కోలాట, నృత్యాలు, నడుమ ఆయన ఎన్నికల ప్రచారం కొనసాగింది. అనంతరం ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ, రాబోయేధి బి ఆర్ ఎస్ పార్టీ పాలనేనని, అన్నారు.

- Advertisement -

పనికి మాలిన వారు కొందరు పనికిమాలిన మాటలు మాట్లాడటం శోచనియమని, ఇకనైనా పనికి మాలిన మాటలు మానుకొని బుద్దిగా ఉండాలని అన్నారు. మేము ఎవరో అన్నట్టు తెలుగుదేశం పార్టీనీ నేను ఒక్కడిని విడలేదని, నేను నియోజకవర్గం అభివృద్ధి గురించి టి డీ పీ పార్టీ నీ విడానని ఆయన తెలిపారు. మేము అధికార బి ఆర్ ఎస్ పార్టీ లో ఉండి ఎవరి మీద కేసులు పెట్టీయడం కానీ మాకు పడని వారి మీద దెబ్బలాటలు ఆడటం నా నైజం కాదని అన్నారు. మండలంలో ఏ గ్రామము వెళ్లిన కూడా ప్రజలు ఎవరికివారు బ్రహ్మరధాలు పడుతున్నారనీ, మళ్ళీ మీరే రావాలి మీరే కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. మాయమాటలు, పూటకో వేషం లో వచ్చి కొందరు ఓట్లు అడుగుతారని అటువంటి వారి మాయమాటలు నమ్మ వద్దని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. రాబోవు రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాణ స్వీకారం అనంతరం సత్తుపల్లి నియోజక వర్గంలో ఎంత మంది దళితులు వున్నారో అట్టి నా దళిత కుటుంబంలో, కుటుంబానికి చొప్పున పది లక్షల రూపాయలు దళిత బంధు తప్పకుండా ఇచ్చి నేను ఇచ్చిన మాట ప్రకారం తప్పకుండా న్యాయం చేస్తానని అన్నారు. అంతేకాకుండా గ్యాస్ సిలెండర్ కేవలం నాలుగు వందల రూపాయలకు అందజేస్తామని, ప్రతీ మహిళకు నెలకు మూడు వేల రూపాయలు చొప్పున వారి,వారి అకౌంట్ లలో వేయడం జరుగుతుందని అన్నారు. ఇధి ఇలా ఉండగా యర్రబోయినపల్లి గ్రామంలో టి డి పి పార్టీ వారు సండ్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని అన్నారు. అందులో భాగంగా ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ, మేము ఒక్కప్పుడు నేను, సండ్ర టి డి పి పార్టీ నుండే బి ఆర్ ఎస్ పార్టీ లోకి వచ్చామని అన్నారు. కే సీ ఆర్ పాలన మంచిగా ఉందని బి ఆర్ ఎస్ పార్టీ లోకి రావడం జరిగిందని తెలిపారు. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో పొద్దస్తమానం ఊరికే మండలంలో ఉన్న సమస్యల వద్దకు వెళ్లి విద్యుత్తు సకాలంలో ఇవ్వట్లేదని ధర్నాలు చేసిన సందర్భంగా అని నామ మండిపడ్డారు మరి ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో ఏనాడు విద్యుత్తు అంతరాయం కలగలేదని, వారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు యావత్తు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా కే సీ ఆర్ చేస్తున్నారని నామా అన్నారు. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే ఎమ్మెల్యేలు సత్తుపల్లి నియోజకవర్గానికి 42నుండి 50 మంది ఉంటారని, అదే బిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉంటారని, ఆ ఒక్కడే మన సండ్ర వెంకటవీరయ్య అని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు పాలెపు రామారావు, యం పీ పీ బీరవల్లి రఘు, జెడ్పీటీసీ సభ్యులు కట్టా అజయ్ కుమార్, కొర్లగూడెం సొసైటీ చైర్మన్ కీసర వెంకటేశ్వర రెడ్డి, ఏయంసి వైస్ చైర్మన్ కాటమనేని వెంకటేశ్వరరావు ,రైతు సమన్వయ సమితి కన్వీనర్ డాక్టర్ లక్కినేని రఘు, మండల బి ఆర్ ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు పెడకంటి రామకృష్ణ, జెడ్పీ కో అప్డేట్ సభ్యులు యం డి ఇస్మాయిల్, నామా నాగేశ్వరరావు ప్రధాన అనుచరులు పోలోజు సుధాకరాచారి ,మండల కో ఆప్షన్ సభ్యులు షేక్ కమ్లి,సెక్రటర్ కొరకొప్పు ప్రసాద్, కల్లూరు సొసైటీ అధ్యక్షులు డిసిసిబి సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ బోబోలు లక్ష్మణరావు , సొసైటీ డైరెక్టర్ దేవరపల్లి భాస్కరరావు, బాలు, అజ్మీరా జమలయ్య, మండల సోషల్ మీడియా అధ్యక్షులు కిరణ్ కుమార్ , మండల సోషల్ మీడియా సహాయ కార్యదర్శి ఏనుగుల అంజి ,పుసులూరి శ్రీనివాసరావు, లేహం, మాజీ జెడ్పీటీసీ సభ్యులు మేకల కృష్ణ, , ఎర్రబోయినపల్లి గ్రామం నుండి గ్రామ సర్పంచ్ సింగిశాల పద్మ ప్రసాద్,గ్రామ బిఆర్ఎస్ యువ నాయకులు పోట్రు ప్రవీణ్, కిరణ్, గద్దే నరేష్, జెట్టి శంకర్, చండ్రుపట్ల సర్పంచ్ ప్రసాద్, కొర్లగూడెం సర్పంచ్ బై రెడ్డి నరసింహారెడ్డి, పేరువంచ ముగ్గు వెంకటాపురం గ్రామ సర్పంచులు, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, మూర్ధాల పిచ్చిరెడ్డి, బీరవల్లి పురుషోత్తం,మాజీ ఎంపీటీసీ సభ్యులు బాలు, రాచమల్ల నాగేశ్వరరావు, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News