Sunday, November 16, 2025
HomeతెలంగాణSamshabad: అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం

Samshabad: అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం

శంషాబాద్ లో రోడ్డు ప్రమాదంలో తలకి తీవ్ర గాయాలైన సీత అనే 35 సంవత్సరాల యువతికి లిమ్స్ లో విజయవంతంగా చికిత్స అందించారు. ప్రమాదంలో గాయపడి క్రిటికల్ స్టేజిలో శంషాబాద్ లిమ్స్ ఆస్పత్రికి తీసుకురాగా పేషెంట్ కండిషన్ ని పరిశీలించిన లిమ్స్ హాస్పిటల్ డాక్టర్ ఎం.డి రామరాజు, సత్యం, బృందం పేషెంట్ పరిస్థితి పరిశీలించగా తలకు బలమైన గాయమై బ్లీడింగ్ తీవ్రత ఎక్కువ కావడంతో చాలా క్రిటికల్ గా ఉన్న పరిస్థితి గమనించిన వైద్యులు ఆ పేషెంటు అపస్మారక స్థితికి వెళ్లకుండా వెంటనే ఆపరేషన్ నిర్వహించాలన్నారు. కానీ 4 లక్షల వరకు అయ్యే ఆపరేషన్ ఖర్చును భరించే స్థితిలో లేని కుటుంబానికి లిమ్స్ వైద్యులు తమ శక్తిమేరా సహకరించి కేవలం లక్షన్నర రూపాయలతో వైద్యం చేశారు.

- Advertisement -

డాక్టర్ రామరాజు సత్యం మాట్లాడుతూ పేషెంట్ ని ఇబ్బంది పెట్టాలని డాక్టర్లకు అస్సలుండదని, సరైన టైంలో నిర్ణయం తీసుకుని వైద్యులకు సహకరిస్తే చికిత్స విజయవంతంగా పూర్తవుతుందన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad