Saturday, December 13, 2025
HomeతెలంగాణSamsthan Narayanpur: రాచకొండ ఉత్సవాల్లో కాంగ్రెస్ నాయకులు

Samsthan Narayanpur: రాచకొండ ఉత్సవాల్లో కాంగ్రెస్ నాయకులు

శివరాత్రి, ఉర్సు రెండూ..

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపుర్ మండల రాచకొండ ప్రాంతంలో స్వయంభు శంభు లింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొని అనంతరం రాచకొండ రాజప్ప సమితి ఉత్సవాలలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత గాలిఫ్ సాహిద్ దర్గా ఉర్సు ఉత్సవాల్లో పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ముద్దంగుల నరసింహ, ఉప్పల లింగస్వామి. అనంతరం వారు మాట్లాడుతూ మత సామరస్యానికి గుర్తుగా నిలిచిన ఉర్సు, శివరాత్రి ఉత్సవాలు కనుల పండుగ జరుగుతుందని కొనియాడారు. ముఖ్యంగా రాచకొండ రాచప్ప సమితి అధ్యక్షులు బద్దుల కృష్ణ కుమార్ యాదవ్, ప్రధాన కార్యదర్శి సూరపల్లి వెంకటేష్, వారి పూర్తి సమయాన్ని కేటాయించి ఈ ఉత్సవాలే కాకుండా నిరంతరం రాచకొండ కోసం రాచకొండ అభివృద్ధి కోసం పరితపిస్తున్నారన్నారు.

- Advertisement -

మునుగోడు నియోజకవర్గం శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో రాచకొండ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొండ్రెడ్డి నరసింహ, పిఎసిఎస్ డైరెక్టర్ ఉప్పల కృష్ణ, రాచకొండ రమేష్ బాబు, గునిగంటి రాజు, ఉప్పల నాగరాజు, విడం సాయి కిషోర్ నేత, కొండ నవీన్ గౌడ్, నల్ల శశి కుమార్, లింగంపల్లి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News