Friday, September 20, 2024
HomeతెలంగాణVemsuru: ప్రచారంలో దూసుకెళుతున్న సండ్ర

Vemsuru: ప్రచారంలో దూసుకెళుతున్న సండ్ర

అభివృద్ధే నినాదంగా..

2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిఆర్ఎస్ నేత, ప్రస్తుత ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య క్షేత్రస్థాయి ప్రచారంలో దూసుకెళుతున్నారు. రోజుకో మండల కేంద్రంలో వ్యాపార సముదాయాలు వద్దకు కాలినడకన స్వయంగా వెళ్ళి బిఆర్ఎస్ ను గెలిపించాలని, కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఓట్ల అభ్యర్థన చేస్తున్నారు. వేంసూరు మండల పరిధిలోని మర్లపాడు గ్రామ షిర్డీ సాయిబాబా కోవెల వద్ద నుండి సండ్ర ప్రారంభించే పాదయాత్రకు మండల బిఆర్ఎస్ గులాబీ పార్టీ నేతలు, యువకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని ఘన స్వాగతం పలికి సండ్రతో అడుగులో అడుగు వేస్తూ ముందుకు సాగారు.

- Advertisement -

మర్లపాడు గ్రామ వ్యాపార సముదాయాల వద్దకు వెళ్ళి వ్యాపారులను, ప్రజలను సండ్ర ఆప్యాయంగా పలకరించి తనను గెలిపించాలని ఓట్లను వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు పాలా వెంకటరెడ్డి, కార్యదర్శి కంటే వెంకటేశ్వరరావు, గండ్ర సోమిరెడ్డి, మందపాటి వేణు గోపాలరెడ్డి, రామోహన్ రెడ్డి, గొర్ల సంజీవరెడ్డి, మందపాటి కృష్ణారెడ్డి, మరాటి రాములు, వుప్పలపాటి కృష్ణయ్య, రాయల సత్యనారాయణ, దుబా శ్రీనివాసరెడ్డి, కొండలరావు, కొణిజర్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News