ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో ముందుండే సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య మరోమారు గొప్ప మనసును చాటుకున్నారు. సత్తుపల్లి పట్నంలోని వేంసూరు రోడ్డు అర్బన్ పార్క్ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు రోడ్డు ప్రమాదానికి గురవగా, అటుగా వెళుతున్న ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య వాహనాన్ని ఆపి, హుటాహుటిన క్షతగాత్రులను స్థానిక హాస్పత్రికి తరలించి వైద్యులతో మాట్లాడి, మెరుగైన వైద్యాన్ని అందించాలని ఆదేశించారు.