Friday, November 22, 2024
HomeతెలంగాణSandra: ఉపాధి హామీ పనుల సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే

Sandra: ఉపాధి హామీ పనుల సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే

పని చేసేటప్పుడు వేసవి కాలంలో ఉపశమనంగా మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ

తల్లాడ సోసైటీ కార్యాలయం లో మండల అధ్యక్షులు రెడ్డం వీరమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ మండలంలో జాతీయ ఉపాధి హామీ పని క్రింద పనిచేస్తున్న కూలీలు అందరికి పనిలో ఉండే విధంగా, 90 రోజుల నుండి పనిచేస్తున్న కూలీలు అందరూ పనిలో ఉండేటట్లు, ఈ అవకాశం ను సద్వినియోగం చేసుకోవాలని, కొన్ని గ్రామాల్లో ఉపాధి హామీ కూలీల సమస్యలను, ఫీల్డ్ అసిస్టెంట్స్ వల్ల కొన్నిచోట్ల ఇబ్బందులు ఉన్నాయి, అని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య దృష్టికి తీసుకొని రాగా ఉపాధి హామీ అధికారి APO కోటయ్యతో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఫోన్ చేసి మాట్లాడారు. కూలీలకు ఏ ఇబ్బందులు కలగకుండా చూడాలని, ఈ నెల 14,15,16 మూడు రోజులపాటు జాతీయ ఉపాధిహామీ పధకంలో పని చేసే కూలీలకు సత్తుపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా 5 మండలల్లో 3 రోజులపాటు అన్ని మండల కేంద్రంలో గ్రామాలలో వారికి పని చేసేటప్పుడు వేసవి కాలంలో ఉపశమనంగా మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమంను ఎమ్మెల్యే సండ్రవెంకట వీరయ్య ప్రారంభించానున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News