Friday, September 20, 2024
HomeతెలంగాణSandra: తొలి ఏకాదశి ఆనందాన్ని, ఆరోగ్యాన్ని నింపాలి

Sandra: తొలి ఏకాదశి ఆనందాన్ని, ఆరోగ్యాన్ని నింపాలి

పితృదేవతలకు ఎంతో ఇష్టమైన పేలాల పిండి

క్యాంపు కార్యాలయంలో పేలాల పిండి ప్రసాదాన్ని పంపిణీ చేసిన సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య. హిందూ సంప్రదాయంలో మొట్టమొదటి పండగ తొలి ఏకాదశి అందరి జీవితాల్లో ఆనందాన్ని ఆరోగ్యాన్ని తీసుకురావాలని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. తొలి ఏకాదశి సందర్భంగా క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య స్వయంగా క్యాంపు కార్యాలయానికి వచ్చిన వారందరికీ పేలాల పిండి ప్రసాదాన్ని పంపిణీ చేసి, తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. జన్మనిచ్చిన పూర్వికులను ఈరోజు గుర్తు చేసుకుంటూ, పితృదేవతలకు ఎంతో ఇష్టమైనటువంటి పేలాల పిండి ప్రసాదాన్ని అందించి వారిని గుర్తు చేసుకునే గొప్ప సాంప్రదాయ పండగ తొలి ఏకాదశి అని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News